Donald Trump Nobel Prize: ట్రంప్‌కు నోబెల్‌ అకాడమీ బిగ్‌షాక్.. ఇక ఆ ప్రైజ్ రానట్టేనా?

డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నామినేషన్ గడువు తేదీ (డెడ్‌లైన్) ముగిసిన తర్వాతే నోబెల్ అకాడమీకి చేరింది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు అందడంతో నామినేషన్‌ను నోబెల్ అకాడమీ తిరస్కరించింది.

New Update
Nobel Prize

Nobel Prize

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిన్న మిస్టేక్ వల్ల నోబెల్ అకాడమీ ట్రంప్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక చిన్న తప్పిదం కారణంగా నోబెల్ శాంతి పురష్కారానికి ట్రంప్ దూరమయ్యారు. నోబెల్ ప్రైజ్ నామినేషన్‌లో బిగ్ మిస్టేక్ జరిగింది. ట్రంప్ నామినేషన్ గడువు తేదీ (డెడ్‌లైన్) ముగిసిన తర్వాతే నోబెల్ అకాడమీకి చేరింది. చివరిగా నోబెల్ ప్రతిపాదనలను పంపేందుకు 2025 ఫిబ్రవరి 1 గా నిర్ణయించారు. అయితే ఈ గడువు తేదీలోగా ట్రంప్‌కు మద్దతుగా సరైన దరఖాస్తులు అకాడమీకి అందలేదు. గడువు ముగిసిన తర్వాత  దరఖాస్తులు అందడంతో ట్రంప్ నామినేషన్‌ను నోబెల్ అకాడమీ తిరస్కరించింది. దీంతో ఇక ట్రంప్‌కు నోబెల్ బహుమతి రానట్టేనని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Illinois: నేషనల్ గార్డ్స్ రావడానికి వీల్లేదు..అడ్డుకున్న ఇల్లినాయిస్ కోర్టు

గడువు తేదీ పూర్తి అయిన తర్వాత..

ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్తాన్, కాంబోడియా ఉన్నాయి. ఈ దేశాల నుంచి పలువురు వ్యక్తులు ట్రంప్‌ను నామినేట్ చేసినప్పటికీ సరైన సమయానికి పత్రాలు అయితే అందలేదు. దీంతో ట్రంప్‌కు ఈసారి శాంతి బహుమతి రానట్లేనని తెలుస్తోంది.  అయితే ఈ సారి నోబెల్ శాంతి బహుమతికి 338 మంది వ్యక్తులు, సంస్థలు నామినేట్ చేశారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతిని అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం వాదించే జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు ప్రదానం చేశారు. అయితే ఈ ఏడాది పాకిస్తాన్-భారత్, ఇజ్రాయెల్-హమాస్ వంటి దేశాల మధ్య సమస్యలను తగ్గించి శాంతిని నెలకొల్పే విధంగా ట్రంప్ పాటుపడ్డారు. దీంతో ఇతనికి నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేశారు. కానీ సరైన సమయానికి చేయలేకపోవడం వల్ల ఫలితం వృథా అయ్యింది. 

ఇది కూడా చూడండి: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు