/rtv/media/media_files/2025/09/05/trump-2025-09-05-14-07-57.jpg)
Trump
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వలసవాదం నుంచి టారిఫ్‌ల పెంపు వరకు అనేక వివాదాస్పద చర్యలు అమలుచేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు విభాగాలు, పాలనాపరమైన అంశాల్లో కూడా అనేక మార్పులు చేశారు. అయితే తాజాగా ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్'గా మారుస్తూ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై త్వరలోనే ఆయన సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ట్రంప్ పిచ్చి చేష్టలు.. పబ్లిక్‌గా మస్క్‌కు భారీ అవమానం!
వాస్తవానికి గతంలో ఈ మంత్రిత్వ శాఖకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ అనే పేరు ఉండేది. 1947 కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ పేరును అమెరికా తొలగించింది. డిపార్ట్ ఆఫ్ డిపెన్స్‌గా నామకరణం చేసింది. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఈ పేరును తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో మాట్లాడారు. '' రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తరచుగా అమెరికా రక్షణశాఖ అని అంటారు. నాకు ఇలా అనడం నచ్చలేదు. అసల రక్షణ అనే పదం ఎందుకు ?. గతంలో పిలుచుకున్నట్లుగానే ఇకనుంచి 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్' అని పిలుద్దాం.
ఇది చాలా శక్తిమంతమైన పదం. ఇదే శక్తితో అమెరికా గతంలో మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో గెలిచింది. ప్రతి విషయంలో కూడా అమెరికా ముందంజలో నిలిచింది. ఇప్పుడు కూడా ఇదే పేరుతో ముందుకెళ్దామని'' ట్రంప్ అన్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్ పాలకవర్గ సభ్యులు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ పేరు మార్పుపై త్వరలో ప్రకటన రానుంది.
ఇదిలాఉండగా 1789లో అమెరికా యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సైనిక, నేవీ దళాలలకు నాయకత్వం వహించేందుకు యుద్ధ సెక్రటరీ ఉండేవారు. ఆ తర్వాత 1798లో ప్రత్యేక నేవీ డాపార్ట్‌మెంట్‌ను స్థాపించారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సైనిక సంస్థను ఏర్పాటుచేసేందుకు ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను స్థాపించారు. మొత్తానికి 1949లో త్రివిధ దళాలలను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ జాతీయ సైనిక సంస్థ పేరును రక్షణశాఖగా మార్చారు.
1789లో అమెరికా యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. యూఎస్ సైనిక, నావికా దళాలకు నాయకత్వం వహించేందుకు ఓ యుద్ధ కార్యదర్శి ఉండేవారు. అనంతరం 1798లో ప్రత్యేక నేవీ విభాగాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం (World War II) తర్వాత .. 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం.. క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ‘జాతీయ సైనిక సంస్థ’ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను రూపొందించారు. 1949లో సైన్యంలోని త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ.. జాతీయ సైనిక సంస్థ పేరును 'యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్'గా మార్చారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఈ పేరును పునరుద్ధరించనున్నారు.