Donald Trump: ట్రంప్ పిచ్చి చేష్టలు.. పబ్లిక్‌గా మస్క్‌కు భారీ అవమానం!

అమెరికాలో ట్రంప్ టెక్ సంస్థల అధినేతలు, సీఈవోలకు ప్రత్యేకమైన విందు ఇచ్చారు. ప్రముఖ టెక్ సంస్థల సీఈవోలు అందరూ ఈ విందుకి హాజరయ్యారు. కానీ ట్రంప్ తన స్నేహితుడు మస్క్‌ను ఆహ్వానించలేదు. దీంతో ట్రంప్ మస్క్‌ను పబ్లిక్‌లో అవమానించాడని పలువురు విమర్శిస్తున్నారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని సందర్భాల్లో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముఖ్య పాత్ర వహించారు. అయితే ట్రంప్ ఇటీవల అమెరికాలో టెక్ సంస్థల అధినేతలు, సీఈవోలకు ప్రత్యేకమైన విందు ఇచ్చారు. దీనికి ప్రముఖ టెక్ సంస్థల సీఈవోలు హాజరయ్యారు. ఈ ప్రత్యేక విందులో ఎలాన్ మస్క్ కనిపించలేదు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, తన గెలుపులో ముఖ్య పాత్ర వహించిన ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించలేదు. దీంతో మస్క్‌కు ట్రంప్ ఇంత అవమానం చేయడం ఏంటని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా  చూడండి: Donald Trump: ఆ కంపెనీ సీఈఓకు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండియాపై మరోసారి అక్కసు!

స్నేహితుడైన మస్క్‌ను పిలవకుండా..

ఈ ప్రత్యేక విందులో మైక్రోసాఫ్ట్‌ కోఫౌండర్‌ బిల్‌ గేట్స్‌, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌, బ్లూ ఆరిజిన్‌ సీఈవో డేవిడ్‌ లింప్‌, ఒరాకల్‌ సీఈవో సఫ్రా కాట్జ్ పలువురు హాజరయ్యారు. కానీ మస్క్ హాజరు కాకపోవడంతో స్నేహితులుగా ఉన్న వీరు శత్రువులగా మారినట్లు తెలుస్తోంది. బహిరంగంగా ఇలా స్నేహితుడిని పిలవకపోవడంతో ట్రంప్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ట్రంప్ పిలిచారని, కాకపోతే కుదరక తాను వెళ్లలేదని మస్క్‌ను తెలిపినట్లు సమాచారం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత మస్క్‌కు కేబినెట్‌లో కీలక డోజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే కొన్ని రోజులకే వారి మధ్య గొడవలు వచ్చాయి. ఓ బిల్లు విషయంలో గొడవ జరిగి మిత్రులుగా ఉన్న వీరు శత్రువులగా మారారు.  పబ్లిక్‌లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అప్పట్లో ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తర్వాత వీరిద్దరి కలిసి కనిపించలేదు. అయితే ఈ విందులో ట్రంప్ యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు సీఈఓ టిమ్ కుక్‌ను పరోక్షంగా బెదిరించినట్లుగా సమాచారం.

ఇది కూడా  చూడండి: Pakistan: పాక్‌కు బిగ్ షాకిచ్చిన చైనా.. మెగా ప్రాజెక్ట్ నుంచి అవుట్.. అట్టడుగునున్న ఆర్థిక సంక్షోభం!

Advertisment
తాజా కథనాలు