/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
భారత షేర్ మార్కెట్లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు దుమ్ము లేపుతున్నాయి. దీంతో దేశీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు మన మార్కెట్ల మీద ఏమీ ప్రభావం చూపించ లేకపోతున్నాయి. దీంతో సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 81,820 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,900 స్థాయిలో ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 19 లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, నెస్లే, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దాదాపు 1% పెరిగాయి. కాగా, ఎటర్నల్ (జొమాటో), కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ 1% తగ్గాయి. అలాగే నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 42 లాభాల్లో ఉన్నాయి. NSE ఫార్మా ఇండెక్స్ 1.51%, హెల్త్ కేర్ 1.26%, రియాల్టీ 1.08% పెరిగాయి. ఐటీ, మెటల్, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాలలో కూడా స్వల్ప పెరుగుదల ఉంది.
మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు..
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ దాదాపు 40 పాయింట్లు తగ్గి 37,500 వద్ద ఉంది. కొరియాకు చెందిన కోస్పి దాదాపు 30 పాయింట్లు పెరిగి 2,625 వద్ద ఉంది. అలాగే హాంగ్ సెంగ్ సూచీ దాదాపు 120 పాయింట్లు పెరిగి 23,800 వద్ద ఉంది. చైనా షాంఘై కాంపోజిట్ 13 పాయింట్లు పెరిగి 3,393 వద్ద ట్రేడవుతోంది. ఇక మే 20న అమెరికా డౌ జోన్స్ 115 పాయింట్లు పడిపోయి 42,677 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 73 పాయింట్లు తగ్గి 19,143 వద్ద, ఎస్ అండ్ పి 500 23 పాయింట్లు క్షీణించాయి. మరోవైపు మే 20న, విదేశీ పెట్టుబడిదారులు రూ.10,016.10 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ పెట్టుబడిదారులు రూ.6,738.39 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. మే నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు నగదు విభాగంలో రూ.13,240.59 కోట్ల నికర కొనుగోళ్లు చేయగా, దేశీయ పెట్టుబడిదారులు రూ.29,799.01 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.
today-latest-news-in-telugu | Stock Market Today | sensex | nifty
Also Read: USA: క్షిపణుల నుంచి రక్షణకు గోల్డెన్ డోమ్..ట్రంప్ ప్రకటన