Tornado in Brazil: బ్రెజిల్‌లో టోర్నడో బీభత్సం.. 4 వందల మంది!

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రంలో శుక్రవారం రాత్రి టోర్నడో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో ఆరుగురు వ్యక్తులు మరణించగా, 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రియో బోనిటో డో ఇగువాకు అనే పట్టణం అల్లకల్లోలంగా మారింది.

New Update
Tornado in Brazil

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రంలో శుక్రవారం రాత్రి టోర్నడో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో ఆరుగురు వ్యక్తులు మరణించగా, 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రియో బోనిటో డో ఇగువాకు అనే పట్టణం అల్లకల్లోలంగా మారింది. పరానా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఈ టోర్నడో దాటికి ఆరుగురు మృతి చెందగా, 437 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. పది మందికి శస్త్ర చికిత్సలు అవసరమవగా, తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సుమారు 14,000 మంది జనాభా ఉన్న రియో బోనిటో డో ఇగువాకు పట్టణంలో దాదాపు 90 శాతం బిల్డింగులు దెబ్బతిన్నాయి. స్థానిక పౌర రక్షణ సంస్థ వివరాల ప్రకారం, సగం కంటే ఎక్కువ పట్టణ ప్రాంతంలో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, టోర్నడో సమయంలో గాలి వేగం గంటకు 180 నుంచి 250 కిలోమీటర్ల (110–155 మైళ్లు) వరకు నమోదైంది. ఈ పెనుగాలుల ధాటికి కార్లు బోల్తా పడ్డాయి, వందలాది ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.

టోర్నడో ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు, అత్యవసర సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ విపత్తులో సుమారు 1,000 మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు. పరానా గవర్నర్ రతినో జూనియర్ పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా బాధితులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి తీవ్ర తుఫానులు సంభవించే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు