Tiger Kingdom : ఆ పార్కులో ప్రాణాంతక వైరస్‌..72 పులులు స్పాట్‌డెడ్‌

థాయ్‌లాండ్‌లోని ఒక పార్కులో గత కొంతకాలంగా వరుసగా పులులు మరణిస్తు్న్నాయి.. ఇప్పటివరకు సుమారు 72 పులులు మృత్యువాత పడ్డాయి. కాగా. వాటి మృతికి కనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (CDV) అనే ప్రాణాంతక వైరస్‌ కారణమని తేల్చడంతో తీవ్ర కలకలం రేపింది.

New Update
Five tigers die

Deadly virus in that park... 72 tigers spotted dead

థాయ్‌లాండ్‌(thailand) లోని ఒక పార్కులో గత కొంతకాలంగా వరుసగా పులులు మరణిస్తు్న్నాయి.. ఇప్పటివరకు సుమారు 72 పులులు మృత్యువాత(tigers dead) పడ్డాయి. కాగా. వాటి మృతికి కనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (CDV) అనే ప్రాణాంతక వైరస్‌ కారణమని తేల్చడంతో తీవ్ర కలకలం రేపింది. పార్కు నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు పార్కులో ఉన్న పులులకు ప్రాణాంతక వైరస్‌ సోకింది. దీని మూలంగా కొన్ని రోజుల వ్యవధిలోనే 72 పులులు మృత్యువాత (Tigers death) పడ్డాయని వాటిని పరీక్షించిన జంతు సంరక్షణ అధికారులు తెలిపారు. దీనికి కనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (CDV) అనే వైరస్‌ కారణమని అధికారులు తేల్చారు.  దీంతో పార్కును తాత్కాలికంగా మూసివేసిన అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు.

Also Read :  అమెరికా, ఇరాన్ యుద్ధం.. ఖమేనీ అంతానికి అమెరికా ప్లాన్‌?

Deadly Virus In That Park - Tiger Kingdom

వివరాల ప్రకారం..థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఉన్న  టైగర్‌ కింగ్‌డమ్‌ (Tiger Kingdom) అనే ప్రైవేటు పార్కుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ పార్కులో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. దీంతో సందర్శకులు ఇక్కడి పులులతో అతి దగ్గరగా ఫొటోలు దిగే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి పార్కులోని పులులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆందోళన చెందిన పార్కు నిర్వహకులు వాటి కళేబరాల నమూనాలను సేకరించి పరీక్షించగా.. శునక, పిల్లి జాతుల్లో కనిపించే సీడీవీ వైరస్‌ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతోపాటు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ తోడు కావడంతో భారీ సంఖ్యలో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయని విషయాన్ని దృవీకరించారు.

నిజానికి శునక, పిల్లుల్లో అనారోగ్యానికి గురైతే వాటి కారణాలు గుర్తించడం సులభమే. కానీ పులులు అనారోగ్యానికి గురైనప్పుడు వాటి కారణాలను గుర్తించడం చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. అవి అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించే సమయానికే చాలా ఆలస్యమవుతుందని దీనివల్ల పెద్ద సంఖ్యలో పులులు మరణిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడున్న మిగతా పులులను సమీపంలోని మరో పార్కుకు తరలించి వాటిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు పార్కు అధికారులు తెలిపారు.

Also Read :  టారిఫ్‌లపై ట్రంప్ చెప్తున్న ప్లాన్ B ఇదే.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతుందంటే..?

Advertisment
తాజా కథనాలు