/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-09-40-09.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విపరీతంగా టారిఫ్‌లు విధించడాన్ని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యతిరేకించింది. ట్రంప్ సెకండ్ టర్మ్ రూలింగ్‌లో "అమెరికా ఫస్ట్" నినాదంతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ప్రకటించిన సవరించిన సుంకాల విధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 20న అమెరికా న్యాయస్థానం ట్రంప్‌కు సుంకాలు విధించే అధికారం లేదని తేల్చి చెప్పింది. విదేశాలపై విధించిన టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు న్యాయవాది చెప్పారు. దీనిపై ట్రంప్ స్పందించి.. తన దగ్గర ప్లాన్ బి కూడా ఉందని అన్నాడు. న్యాయస్థానాలు టారిఫ్‌లను కొట్టేస్తే వాటిని ఎలా అమలు చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. అమెరికా రాజ్యాంగంలో సుంకాలు పెంపుపై ట్రంప్ తనకున్న అనుకూల అంశాలను చూపిస్తూ టారిఫ్‌లు కొనసాగించే అవకాశం ఉంది.
ఏ అధికారాలతో ఈ సుంకాలు విధించవచ్చు?
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. పన్నుల విధింపు అధికారం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ, గతంలో చట్టసభలు అధ్యక్షుడికి కొన్ని ప్రత్యేక అధికారాలను దారాదత్తం చేశాయి. వాటిని ఉపయోగించి ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు.
సెక్షన్ 122 (ట్రేడ్ యాక్ట్ 1974): అమెరికా చెల్లింపుల శేషం లోటును తగ్గించడానికి అధ్యక్షుడు 150 రోజుల పాటు గరిష్టంగా 15% వరకు తాత్కాలిక సుంకాలు విధించవచ్చు.
సెక్షన్ 301 (ట్రేడ్ యాక్ట్ 1974): ఏదైనా దేశం అమెరికా పట్ల అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తున్నట్లు భావిస్తే, అధ్యక్షుడు దర్యాప్తు జరిపి ఆ దేశ ఉత్పత్తులపై భారీగా పెనాల్టీలు లేదా సుంకాలు విధించవచ్చు. గతంలో చైనాపై ట్రంప్ ఈ చట్టాన్నే ప్రయోగించారు.
సెక్షన్ 232 (ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ 1962): జాతీయ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే విదేశీ వస్తువులపై (ఉదాహరణకు స్టీల్, అల్యూమినియం) నియంత్రణ విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA): దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి, విదేశీ వాణిజ్యాన్ని నియంత్రించే విస్తృత అధికారాలు కూడా అధ్యక్షుడికి ఉన్నాయి.
సుంకాల విధింపు వెనుక ట్రంప్ వాదన
ట్రంప్ ప్రధానంగా ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నాయని, దీనివల్ల అమెరికా వాణిజ్య లోటు పెరుగుతోందని వాదిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌ను "టారిఫ్ కింగ్" అని సంబోధిస్తూ, అమెరికా నుంచి వెళ్లే వస్తువులపై 100% వరకు సుంకాలు విధిస్తున్న దేశాలకు తాము కూడా అదే స్థాయిలో "ప్రతీకార సుంకాలు" విధిస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి, ట్రంప్ తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు అమెరికా తయారీ రంగానికి ఊతం ఇస్తాయని కొందరు అంటుంటే, వినియోగదారులకు ధరలు పెరుగుతాయని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
Follow Us