బిడ్డ అందంపై అనుమానం.. డీఎన్‌ఏ టెస్టులో తండ్రి మైండ్‌ బ్లాక్!

కూతురు అందంపై అనుమానంతో వియత్నాంలోని ఓ తండ్రి డీఎన్ఏ టెస్టు చేయించాడు. ఇందులో తన బిడ్డ కాదనే తేలడంతో కుటుంబానికి దూరమై మద్యానికి బానిసయ్యాడు. అయితే హాస్పిటల్ లో పిల్లలు మారినట్లు తన భార్య రుజువు చేయడంతో అసలు విషయం బయటపడింది.  

author-image
By srinivas
New Update
rrerer

Vietnam: కన్న బిడ్డ అందం ఓ తండ్రికి నిద్రల్లేని రాత్రులు మిగిల్చింది. భార్య, తాను అందంగా లేకపోయినా తమకు పుట్టిన కూతురు అందాలరాశి కావడంపై అనేక సందేహాలకు దారితీసింది. ఆ అమ్మాయి తన కూతురు కాదేమోనన్న అనుమానం మొదలైంది. దీంతో భార్యను అనుమానించడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అయినా ఏ మాత్రం తగ్గని తండ్రి.. డీఎన్‌ఏ టెస్టు చేయింయిచగా ఊహించని రిజల్ట్ రావడంతో తలకిందులయ్యారు. ఇంతకు ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం. 

తన కుమార్తె కాదని డాక్టర్లు చెప్పడంతో..

వియత్నాంలోని హనోయ్‌ కి చెందిన దంపతులకు లాన్ అనే కూతురు టీనేజ్‌ వయసులో చాలా అందంగా తయారైంది. అయితే కూతురు గ్లామర్ పై అనుమానం మొదలైన తండ్రి.. భార్య హాంగ్‌ పై అనుమానంతో కుమార్తె లాన్‌కు డీఎన్‌ఏ టెస్టు చేయించేశాడు. ఈ రిపోర్టు చూసిన తండ్రికి మైండ్‌ బ్లాక్‌ అయింది. లాన్‌ తనకు పుట్టిన కుమార్తె కాదని డాక్టర్లు చెప్పడంతో భార్య హాంగ్‌ను, కూతురును వదిలేశాడు. ఇది తట్టుకోలేక మద్యానికి అలవాటు పడ్డాడు. 

ఇది కూడా చదవండి: ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!

పేరెంట్స్‌ మధ్య పరిచయంతో గుట్టు రట్టు.. 

అయితే కొంతకాలానికి హాంగ్‌ తన కూతురుని తీసుకుని తిరిగి హనోయ్‌ సిటీకి వెళ్లిపోయింది. అక్కడ లాన్ చదువుతున్న స్కూల్లో మరో అమ్మాయి పుట్టిన రోజు కూడా సేమ్ కావడంతో పేరెంట్స్‌ మధ్య పరిచయం ఏర్పడింది. అలా లాన్‌ పుట్టిన ఆస్పత్రిలోనే ఆ అమ్మాయి కూడా పుట్టిందనే విషయాన్ని లాన్‌ తల్లి హాంగ్‌ కు తెలిసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలకు డీఎన్‌ఏ టెస్టు చేయించింది. ఈ టెస్టులో వారి కూతురే హాంగ్ బిడ్డగా తేలింది. అనుకోకుండా పిల్లలిద్దరిని హాస్పిటల్ సిబ్బంది మార్చి ఉంటారని వైద్యులు తెలిపారు.  ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ స్టోరీమాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు