BIG BREAKING: కుప్పకూలిన మరో విమానం.. ఇద్దరు కీలక నేతలతో సహా..15 మంది మృతి

కొలంబియాలో మరో విమాద ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కీలక నేతలతో సహా 15 మంది మృతి చెందారు. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లో ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.

New Update
BREAKING

BREAKING

దేశంలో ఇటీవల చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఈ విమాన ప్రమాదం మరవక ముందే కొలంబియాలో మరో విమాద ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కీలక నేతలతో సహా 15 మంది మృతి చెందారు. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లో ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలు క్విన్‌టెరో, సాలకెడో కూడా ఉన్నారు.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

రాడార్ నుంచి కనిపించకుండా..

ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు విమానం అకస్మాత్తుగా రాడార్ నుంచి అదృశ్యమైంది. విమానం గమ్యస్థానానికి చేరుకునే లోపే కొలంబియా-వెనిజులా సరిహద్దు ప్రాంతంలో కుప్పకూలిపోయింది. సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండటంతో సహాయక చర్యలకు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఈ విమానంలో ఇద్దరు కీలక నేతలు ఉండటంతో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం.. కారణమిదే?

Advertisment
తాజా కథనాలు