/rtv/media/media_files/2025/12/20/cm-revanth-2025-12-20-15-11-01.jpg)
CM Revanth
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఎం రేవంత్‌పాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చలు జరిపారు. అయితే పార్టీ రెబల్స్‌తో సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలపై సీఎం రేవంత్, మహేశ్‌కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణను గజ గజ వణికిస్తున్న చలి.. మరో మూడు రోజుల పాటు ఈ జిల్లాల ప్రజలకు చుక్కలే!
పంచాయతీ ఎన్నికల కోసం సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. రెబల్స్‌తో సమన్వయం లేకపోవడం, బంధువులను అభ్యర్థులుగా పోటీలోకి దింపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేశారని అసహనం వ్యక్తం చేశారు. తమ వైఖరి మార్చుకుని పార్టీ రూల్స్‌కు కట్టబడి పనిచేయాలంటూ హితువు పలికారు.
Also Read: ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్.. తోషఖానా కేసులో మరో 17 ఏళ్లు జైలు శిక్ష
ఇదిలాఉండగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలిచారు. 31 జిల్లాల్లో మొత్తం 12,733 గ్రామాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 7010 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 3502 స్థానాల్లో బీఆర్‌ఎస్, 688 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇతరులు 1505 స్థానాల్లో విజయం సాధించారు. అయితే పార్టీకి పట్టుఉన్న పలు గ్రామాల్లో స్థానాలు కోల్పోవడంపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే దీనికి బాధ్యులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో మీటింగ్ నిర్వహించింది.
Follow Us