/rtv/media/media_files/2025/12/20/imran-khan-2025-12-20-13-44-44.jpg)
Imran khan
తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ కోర్టు బిగ్ షాకిచ్చింది. మరో 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 17 ఏళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తోషఖానా వివాదం 2021లో మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ దంపతులు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఆ సమయంలో సౌదీ యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన 'బుల్గారి' ఆభరణాల సెట్‌ను బహుమతిగా ఇచ్చారు.
Pakistani court sentences former PM Imran Khan and his wife, Bushra Bibi, to 17 years in prison each for alleged corruption involving underpriced purchase of luxury state gifts – local media pic.twitter.com/ekh28JDgEW
— TRT World Now (@TRTWorldNow) December 20, 2025
తక్కువ ధరకు తీసుకుని..
పాకిస్తాన్ రూల్స్ ప్రకారం దేశాధినేతలకు వచ్చే ఖరీదైన బహుమతులను 'తోషఖానా'కు అప్పగించాలి. కానీ ఇమ్రాన్ ఖాన్ ఆ ఆభరణాలను ప్రభుత్వానికి అప్పగించకుండా నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు తీసుకుని, వాటిని బయట భారీ ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇమ్రాన్ ఖాన్ ఖరీదైన బహుమతులను విక్రయించాడని తేలడంతో పాకిస్తాన్ కోర్టు అతనికి శిక్ష విధించింది. అయితే ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రామన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని భార్య బుష్రా బీబీ ఇద్దరికీ కూడా 17 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు ఇద్దరికీ కలిపి భారీగా జరిమానా కూడా విధించారు.
ఇది కూడా చూడండి: Bangladesh: దేశం గజగజ వణికిపోవడం గ్యారెంటీ.. ప్లాన్ ప్రకారమే ఉస్మాన్ హదీని కరీం హత్య చేశాడా?
ఒక్కొక్కరు 1.64 కోట్ల పాకిస్తానీ రూపాయలను జరిమానాగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితుల వయస్సును బుష్రా బీబీ మహిళ అనే అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ శిక్ష ఖరారు చేసినట్లు జడ్జి పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలు ఇతర కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నారు. ఈ తీర్పును తాము అంగీకరించడం లేదని ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును త్వరలోనే హైకోర్టులో సవాలు చేస్తామని వారు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇమ్రాన్‌ను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇక జీవితం జైలులోనే పూర్తి కావాలని, రాజకీయంగా ఎదగకూడదని కారణంతో ఇలా చేస్తున్నట్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి: America Attacks: సిరియాపై అమెరికా భీకర దాడులు.. ప్రతీకారం తీర్చుకున్న వైట్‌హౌస్
Follow Us