/rtv/media/media_files/2025/04/15/MUs0VNxzte0ZYCUDPhBw.jpg)
Civilian death toll in Sudan’s Darfur attacks tops 300 in two days
ఆఫ్రికాలోని సూడాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల పారమిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల వల్ల ఇప్పటిదాకా 300 మందికి పైగా మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా ఏజెన్సీ తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గతవారం ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు అబూషాక్, జామ్జామ్ శిబిరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఇందులో 300 మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్ ఫర్ ది కో ఆర్టినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) తెలిపింది.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ.. పేలుతున్న మాటల తూటాలు!
మృతుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్‌కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది. వాళ్లు జామ్జామ్ శిబిరంలో ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తుండగా ప్రాణాలు వీడినట్లు పేర్కొంది. మరణించిన వాళ్లలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు యూఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులను ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని.. పౌరులకు, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు 16 వేల మంది పౌరులు జామ్జామ్ శిబిరాన్ని వీడినట్లు సమాచారం.
Also Read: ట్రంప్ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..
ఇదిలాఉండగా 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్‌బర్హాన్, మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. ఇక సుడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)ల మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 29,600 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఇక కోటి మందికి పైగా సూడాన్‌కు వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !
africa | africa-sudan | rtv-news