/rtv/media/media_files/2025/12/28/china-2025-12-28-08-37-53.jpg)
chinese-train-breaks-world-record-hits-700-kmph-in-just-two-seconds
సాంకేతిక రంగంలో చైనా రోజురోజుకు దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి చైనా హైస్పీడ్ రైళ్ల నెట్‌వర్క్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా అత్యంత వేగంగా దూసుకెళ్లే మ్యాగ్లెవ్ రైలను పరీక్షించింది. ఈ టెస్టులో టన్ను బరువు ఉన్న రైలు కేవలం 2 సెకన్లలోనే 0 నుంచి 700 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది. 400 మీటర్ల మ్యాగ్లెవ్ ట్రాక్‌పై ఈ పరీక్ష జరిపారు.
Also Read: మందుతాగితే ఇంగ్లీష్ అనర్ఘలంగా ఎందుకు మాట్లాడుతారో తెలుసా? విషయం తెలిస్తే షాకవుతారు..
మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించామని చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ తెలిపింది. ఈ సాంకేతికత ద్వారా సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ల సాయంతో రైలు పట్టాలకు కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో ప్రయాణం చేస్తుంది. అంటే సాధారణ రైలులా ఇది చక్రాలపై ఆధారపడి వెళ్లదు. అయస్కాంత బలాలను (ఆకర్షణ, వికర్షణ)ను వినియోగించి దూసుకెళ్తుంది. రైలు ట్రాక్‌ను అది తాకకుండా ఉండటంతో ఘర్షణ అనేది జరగదు. అందుకే ఆ ట్రైన్ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. అయితే ఈ రైలును పరీక్షిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంటికి కనిపించనంత వేగంతో ఇది దూసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
చైనా ట్రైన్ రికార్డు
— greatandhra (@greatandhranews) December 27, 2025
చైనా మాగ్లెవ్ రైలు 2 సెకన్ల్లోనే 700 kmph చేరి రికార్డు బ్రేక్ చేసింది.
అయస్కాంత శక్తితో దూసుకెళ్తున్న ఈ టెక్ — ఫ్యూచర్ ట్రావెల్‌కు గేమ్‌చేంజర్! pic.twitter.com/eLB4mpn8WD
Also Read: సికింద్రాబాద్‌లో ‘స్మార్ట్’ సౌకర్యాలు..ఇక మీదట వర్క్ ఫ్రం రైల్వే స్టేషన్
Follow Us