China - Taiwan: తైవాన్ చుట్టూ 33 యుద్ధ విమానాలు మోహరించిన చైనా..
చైనా - తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా.. తైవాన్ చుట్టూ చైనా 33 యుద్ధ విమానాలను మోహరించింది. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటేశాయి. దీంతో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు తైవాన్ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.