/rtv/media/media_files/2026/03/02/chinese-hq-9b-2026-03-02-16-20-30.jpg)
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో(US-Israel strikes) ఇరాన్ నగరాల్లో భారీగా భవనాలు, ఆస్తులు ధ్వంసం కావడంతో ఆ దేశ రక్షణ వ్యవస్థపై నీలినీడలు ముసురుకున్నాయి. ముఖ్యంగా చైనా నుండి దిగుమతి చేసుకున్న HQ-9B(Chinese HQ-9B) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో మరోసారి చైనా ఉత్పత్తులు డమ్మీ అని ప్రూ అయింది. గతంలో ఇరాన్ వద్ద రష్యాకు చెందిన ప్రసిద్ధ ఎస్-300 వ్యవస్థ ఉండేది. అయితే, అమెరికా క్షిపణులను అడ్డుకోవడంలో అది విఫలం కావడంతో, ఇరాన్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు మొగ్గు చూపింది. చమురు సరఫరాకు బదులుగా చైనా నుండి ఈ సరికొత్త హెచ్‌క్యూ-9బీ వ్యవస్థను ఒప్పందం చేసుకుని తెచ్చుకుంది. ఇజ్రాయిల్ చేసిన దాడుల నుంచి చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ సుప్రీం నాయకుడిని కాపాడలేకపోయింది.
Also Read : నెతన్యాహు ఆఫీస్‌పై మిస్సైల్ అటాక్.. దెబ్బకు దెబ్బ అంటున్న ఇరాన్
Iran Air Defense sSystem Chinese HQ-0B
చైనా ఎయిరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, అమెరికా 'పాట్రియట్' క్షిపణి వ్యవస్థను పోలి ఉంటుంది. ఇది 260 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, 50 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న విమానాలను లేదా క్షిపణులను కూల్చివేయగలదని చెబుతుంటారు. అందుకే ఇరాన్ తన అత్యంత కీలకమైన అణుకేంద్రాలు, ఇంధన శుద్ధి కర్మాగారాల వద్ద వీటిని కాపలా పెట్టింది.
ఇంతటి శక్తివంతమైన వ్యవస్థ అందుబాటులో ఉన్నా, శత్రుదేశాల దాడులను అడ్డుకోవడంలో ఇది ఎందుకు వెనుకబడింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. గతంలో పాకిస్థాన్ వద్ద ఉన్న ఇలాంటి వ్యవస్థే భారత దళాల దాడులను అడ్డుకోవడంలో ఇబ్బంది పడిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్(iran-isreal-war) అణుకేంద్రాల వద్ద కూడా ఇవి ప్రభావం చూపకపోవడం చైనా యుద్ధ తంత్ర పరిజ్ఞానంపై అనుమానాలను పెంచుతోంది.
Also Read : ఇరాన్ దాడులు.. దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు..
Follow Us