/rtv/media/media_files/2025/02/26/DHBxIDJLmUhAmelqEnqg.jpg)
slbc Photograph: (slbc)
పద్నాలుగు రోజులు అవుతోంది కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. కూలిన టన్నెల్ లో కార్మికులందరూ చనిపోయారని తెలుసుకోగలిగారు కానీ వారి మృతదేహాలను మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. దీంతో నిన్నటి నుంచి అక్కడ సహాయక చర్యలను మింత ముమ్మరం చేశారు. నిన్న క్యాడవర్ డాగ్స్ బృందాన్ని తీసుకువచ్చారు. ఈరోజు టన్నెల్ ను తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకో మోటర్ తీసుకెళ్లింది. దాంతో పాటూ 110 మంది సిబ్బంది కూడా లోపలికి వెళ్ళారు. అన్వేషణ తర్వాత ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలో పరిస్థితులను నాగర్‌కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.
క్యాడవర్ డాగ్స్...
నిన్న కార్మికుల జాడ కనుగొనేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను రప్పించారు. ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకువచ్చారు. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌ను టన్నల్ వద్దకు రప్పించారు. 8 మందిని గుర్తించేందుకు క్యాడవర్ డాగ్స్‌ను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం, జిల్లా కలెక్టర్ సంతోష్.. విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. 8మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద, మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు 13 రోజులుగా చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం తేలకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషిన్(టీబీఎం)పైన, చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని పంప్ చేస్తున్నారు.
Also Read: Singer Kalpana: నా భర్తతో నాకేం గొడవలు లేవు..సింగర్ కల్పన వీడియో