/rtv/media/media_files/2025/08/06/chikungunya-virus-2025-08-06-20-01-52.jpg)
chikungunya virus
ఒకప్పుడు చికున్‌గున్యా(chicken-gunya) ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. 2005లో ఈ వైరస్ ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని నెలల నుంచి మళ్లీ ఈ కేసులు పెరుగుతున్నాయి. ఆఫ్రికన్ దీవులైన మయోట్టే, మారిషష్ తదితర ప్రాంతాల నుంచి మడగాస్కర్, కెన్యా, సొమాలియా దాకా ఈ వైరస్ వ్యాపించింది. మళ్లీ ఇప్పుడు చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు ప్రవేశించింది. ఇప్పటిదాకా అక్కడ 7 వేలకు పైగా చికున్‌గున్యా కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది.
Also Read: 45 పైసలకే ప్రమాద బీమా, ఐదేళ్లలో రూ.27.22 కోట్లు చెల్లించాం.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ను అరికట్టడం కోసం చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజలందరూ తమ ఇళ్లలోనే నిల్వఉన్న నీటిని తొలగించుకోవాలని.. లేకపోతే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు ఈ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 119 దేశాల్లో 560 కోట్ల మంది చికున్‌గున్యాకు గురయ్యే ప్రమాదంలో ఉన్నారని పేర్కొంది. అయితే ఇది సాధారణ జ్వరం కాదని.. దీని ప్రభావం కొన్ని నెలల పాటు ఉంటుందని, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, ప్రపంచ ప్రయాణాల వల్ల ఈ వైరస్ పెరుగుతోంది. మే 1 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఫ్రాన్స్‌లో 800 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ఎలా వ్యాపిస్తుంది ?
ఈ వైరస్ అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి రాదు. ఒక దోమ వైరస్ సోకిన వ్యక్తిని కుట్టి.. మళ్లీ అదే దోమ వేరొకరిని కుడితే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అందుకే ఇది వేగంగా విస్తరిస్తుంది. ఇది ఒక వైరల్ ఫీవర్(Viral Fever). ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే రెండు రకాల దోమల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ దొమలు ఎక్కువగా పగటి సమయంలో కుడుతాయి. తొలిసారిగా 1952లో టాంజానియాలో ఈ వైరస్‌ను గుర్తించారు.
Also Read: 'ట్రంప్ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ
వైరస్ సోకిన దోమ కాటు వేశాక 48 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కళ్ళల్లో మంట కూడా వస్తుంది. అయితే చికున్‌గున్యాకు ప్రత్యేకంగా యాంటీవైరల్ మందు లేదు. ఈ వైరస్ సోకిన వాళ్లు పారాసిటమల్ లాంటి మందులు, ఎక్కువ నీరు, విశ్రాంతి తీసుకోవడం వంటివి పాటించాల్సి ఉంటుంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి దశలోనే ఉంది. కొన్ని వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. కానీ అవి మార్కెట్‌లో ప్రజలకు అందుబాటులో లేవు. అందుకే దీనికి నివారణే మార్గం.
ఎలా నివారించవచ్చు?
ముఖ్యంగా ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి పాత్రలను మూసివేయాలి. దొమతెరలు, వికర్షక మందులు వాడాలి. లాంగ్ స్లీవ్ దుస్తులు వేసుకోవాలి. వర్షకాలంలో చికున్‌గున్యా సోకే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటే ఈ సమయంలోనే ఎక్కువగా దొమలు పుడతాయి. అందుకే వర్షకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.