Janaka Aithe Ganaka
ఓటీటీ 'జనక అయితే గనక'
తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సంగీత్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Prepare yourself for a rollercoaster of emotions and non-stop entertainment 💯💥
— ahavideoin (@ahavideoIN) October 30, 2024
#janakaaitheganaka premieres on 8 th November only on #aha #janakaaitheganakaonaha@ActorSuhas @sangeerthanaluv @KalyanKodati@kk_lyricist @HR_3555 #HanshithaReddy@DilRajuProdctns pic.twitter.com/bkhzNbPXL3
మూవీ స్టోరీ
ఈ మూవీ అంతా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. ఇందులో హీరో (సుహాస్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి పాత్రను పోషించాడు. LKG, UKG లకే లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలంలో.. పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనే భయంతో హీరో(సుహాస్) ఉంటాడు. ఇంతలో అతని భార్య ప్రెగ్నెంట్ అంటూ సుహాస్ కు షాకిస్తుంది. దీంతో సుహాస్ తాను వాడిన కండోమ్ వలనే ఇలా అయ్యిందని.. నాసిరకం కండోమ్‌లను సప్లయ్ చేస్తున్న కంపెనీపై కేసు పెడతాడు. ఇక ఈ కేసుతో సుహాస్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..? తాను కండోమ్ కంపెనీ పై పెట్టిన కేసు గెలిచాడా..? అనే అంశాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతోంది.
Also Read: 'మట్కా' నుంచి మరో కొత్త పోస్టర్.. వైరల్ అవుతున్న లుక్