/rtv/media/media_files/2025/07/25/yash-2025-07-25-10-19-58.jpg)
Yash Dayal
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్ ఇప్పుడు మరో వివాదం చిక్కుకున్నాడు. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన యశ్ పై లైంగిక ఆరోపణలు చేసింది. తనతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని..ఇంట్లో కూడా కోడలిగా పరిచయ్ చేసి తర్వాత శారీరకంగా, మానసికంగా హింసించాడని చెప్పింది. కొంత కాలం తర్వాత అతడికి ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అప్పుడు అలహాబాద్ కోర్టు యశ్ అరెస్ట్ పై స్టే ఇచ్చింది.
ఇప్పుడు మరో అమ్మాయిని..
తాజాగా రాజస్థాన్ కు చెందిన మరో అమ్మాయి యశ్ దయాళ్ పై కేసు నమోదు చేసింది. క్రికెట్ కెరీర్ లో సలహాలు ఇస్తానంటూ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ లోని సీతాపురంలో ఓ హోటల్ కు పిలిచి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆ తర్వాత కూడా రెండేళ్ల పాటూ బ్లాక్ మెయిల్ చేసి మరీ అత్యాచారం చేశాడని యువతి చెబుతోంది. దీంతో అతనిపై రాజస్థాన్ లో పోక్సో కేసు నమోదు అయింది. లైంగిక వేధింపులు మొదలైనప్పుడు ఆ అమ్మాయి వయసు 17 ేళ్ళు కావడంతోనే ఈ కేసు నమోదు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేరం కనుక రుజువైతే యశ్ కు కనీసం 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Also Read: Big Breaking: రాజస్థాన్ లో దారుణం.. కూలిన స్కూల్ బిల్డింగ్..నలుగురు మృతి