Team Aid సంస్థ చొరవతో.. విదేశాల్లో చనిపోయిన భారతీయుల మృతదేహాల తరలింపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం!

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులకు 'టీమ్‌ ఎయిడ్' సంస్థ కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో చనిపోయే భారతీయల మృతదేహాలను వారి పాస్‌పోర్టు అందుబాటులో లేకున్నా కూడా ఇండియాకు తరలించేలా భారత అంగీకరించినట్లు పేర్కొంది.

New Update
Central govt Key decision on indian diaspora worldwide with the request of Team Aid Organisation

Central govt Key decision on indian diaspora worldwide with the request of Team Aid Organisation

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులకు 'టీమ్‌ ఎయిడ్' (Team Aid) సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి విదేశాల్లో చనిపోయే భారతీయల మృతదేహాలను వారి పాస్‌పోర్టు అందుబాటులో లేకున్నా ఇండియాకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చిందని పేర్కొంది. ఈ మేరకు Team Aid వ్యవస్థాపకుడు 'మోహన్ నన్నపనేని'.. మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. టీమ్‌ ఎయిడ్‌ సంస్థ భారత సంతతి ప్రజలకు, ప్రవాస భారతీయులకు అన్ని విషయాల్లో అండగా ఉంటోందని తెలిపారు. వారి మృతదేహాలను భారత్‌కు తరలించడం, గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం, అత్యవసర సమయాల్లో భారతీయ కుటుంబాలకు సాయం చేయడం లాంటివి చేస్తోందన్నారు.

Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. కేరళలో కొత్త వైరస్

విదేశాల్లో ఉన్న భారతీయుల సమస్యలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ సపోర్ట్‌తో ఈ-కేర్‌ పోర్టల్‌ను ప్రారంభించడంలో సాయం చేశామని.. ఇది మానవ అవశేషాలు భారత్‌కు తరలించేందుకు మార్గం సులభతరం చేసిందని తెలిపారు. ఇప్పుడు భారతీయుల మృతదేహాలను వారి పాస్‌పోర్టు అందుబాటులో లేకున్నా కూడా భారత్‌కు తరలించవచ్చని పేర్కొన్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య ఉందని.. ఇంతకుముందు భారతీయ ఇమిగ్రేషన్ అధికారులు జరిమానా వేస్తారనే భయంతో ఎయిర్‌లైన్‌ సంస్థలు మృతదేహాల పాస్‌పోర్టు లేకుండా వాటిని తరలించేందుకు అంగీకరించేవి కాదని తెలిపారు. 

కానీ టీమ్‌ ఎయిడ్‌ (Team Aid) దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను సంబంధింత మంత్రిత్వశాఖల దృష్టికి చేరవేసినట్లు పేర్కొన్నారు. తమ చీఫ్‌ అడ్వైసర్, జైపూర్ ఫూట్‌ యూఎస్‌ఏ ఛైర్మన్‌ ప్రేమ్ బండారి, తాను కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించామన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది భారతీయ కుటుంబాలకు, ఎయిర్‌లైన్‌ సంస్థలకు, కన్సల్టేట్లకు ఎంతగానో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.  ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, భారత ఎంబసీ, ఇతర అధికారులకు మేము హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు