/rtv/media/media_files/2025/03/03/eLSKmh5P34otg8HnAPQH.jpg)
USAID
ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నిలిపివేస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌లో కూడా సంచలనం రేపింది. యూఎస్ ఎయిడ్ నిధులను భారత్‌లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు వినియోగించారని ట్రంప్ ఆరోపణలు చేశారు. కానీ భారత ప్రభుత్వం ట్రంప్ ఆరోపణలను ఖండించింది. యూఎస్ ఎయిడ్‌ను భారత్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసమే కేటాయించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్!
భారత్ లో USAID నిధులు ?
ఇక వివరాల్లోకి వెళ్తే.. యూఎస్ ఎయిడ్ భారత్‌లో ఏడు ప్రాజెక్టులతో పాలుపంచుకుంది. ఇందులో దాదాపు 750 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, నీటి పరిశుభ్రత, విపత్తు నిర్వహణ, ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాయి. అయితే ఓటర్ టర్నింగ్ కార్యక్రమాలకు కేటాయించిన నిధుల గురించి ఈ నివేదకలో ఎక్కడా చెప్పలేదు. 2024 ఎన్నికలకు ముందు విద్యార్థుల మధ్య రాజకీయ, పౌర నిశ్చితార్థానికి మద్దతు ఇచ్చేందుకు.. 2022లో బంగ్లాదేశ్‌కు 21 మిలియన్లు కేటాయించినట్లు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా యూఎస్ ఎయిడ్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ చూపించిన నివేదికలను కూడా కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఖండించాయి.
Also Read: రెండు కుటుంబాల్లో విషాదం నింపిన వాట్సప్ ముద్దు.. ఇద్దరినీ నరికి చంపిన భర్త!
గతంలో UPA ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014లో లోక్‌సభ ఎన్నికల జరిగిన సంగతి తెలసిందే. ఆ సమయంలో కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ (CEPPS) ద్వారా ఓటర్ టర్నింగ్ కోసం భారత్‌లోకి 21 మిలియన్ల యూఎస్ ఎయిడ్ వచ్చినట్లు పలు నివేదికలు తెలిపాయి. కానీ విదేశీ సంస్థలు తమ ఎన్నికలు, పాలన ప్రక్రియను నిర్దేశించవని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే
Also Read: అమెరికాలో మళ్లీ కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు