/rtv/media/media_files/2025/03/03/x7a0PSk1iz1QnTp21ofX.jpg)
Wildfires in USA
ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ఏంజెల్స్‌లో చెలరేగిన కార్చి్చ్చు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాలు మంటలకు ఆహుతైపోయాయి. జనావాసాలు కూడా కాలి బుడిదయ్యాయి. బిలియన్ల డాలర్ల ఆస్తినష్టం జరిగింది. అయితే తాజాగా అమెరికాలో మళ్లీ కార్చిచ్చు మొదలైంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు వ్యాపించింది. దీంతో ఇప్పటికే వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read: రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఘటనస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. దక్షిణ కరోలినాలో ఇప్పటికే 4.9 చదరపు కిలోమీటర్ల వరకు అటవీ భూమి కాలిపోయింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అటవీ సంరక్షణ విభాగం వెల్లడించింది. అయితే ఈ కార్చిచ్చు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గాయపడ్డారు అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు సౌత్ కరోలినాలో ఆ రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. మొత్తం 175 ప్రాంతాల్లో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు.
Also Read: మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే
ఇదిలాఉండగా జపాన్‌లో కూడా గత 30 ఏళ్లలో ఎప్పుడూ రాని అతిపెద్ద కార్చిచ్చు వచ్చింది. ఇప్పటిదాకా 4500 ఎకరాల్లో అటవి భూమి కాలిపోయింది. అయితే ఈ మంటలు ఇప్పట్లో ఆగేలా లేవని అధికారులు చెబుతున్నారు. ఈ కార్చిచ్చును మొదటగా గత బుధవారం గుర్తించారు. ఇప్పటిదాకా 84 ఇళ్లను కాల్చేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆదివారం ఉదయం దాదాపు 4600 మందిని ఇళ్లు ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశించారు. సహాయక చర్యల కోసం విమానాలను కూడా రంగంలోకి దింపారు.
Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
Also Read: ''గంగా జలాలు దానికి పనికిరావు''.. ఆర్థిక సర్వేలో సంచలన విషయాలు