భారతీయ విద్యార్థుల్లో(Indian Students) చాలామంది అమెరికా, కెనడా(Canada) లాంటి విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం వారికి అనుకూలంగా ఉండటం లేదు. ఇప్పటికే అమెరికా భారతీయ విద్యార్థులకు వీసా ఇచ్చే విషయంలో రూల్స్ కఠినతరం చేసింది. అనేకమంది వీసాలను రిజెక్ట్ చేస్తోంది. దీంతో అమెరికా వీసాలు భారతీయ విద్యార్థులకు దొరకడం కష్టంగా మారింది. తాజాగా కెనడా కూడా బిగ్ షాకిచ్చింది. భారీ స్థాయిలో స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తోంది.
Also Read: నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చిన 11 ఏళ్ల బాలిక.. అసలు కథ ఇదే !
Canada Rejects Indian Student Visa Applications
2025లో 80 శాతం భారతీయ విద్యార్థుల వీసా(Visa) ను కెనడా రిజెక్ట్ చేసింది. అక్కడి స్థానిక పరిస్థితులు, నివాస కొరత, మౌలిక సదుపాయాలు, భారీ ఖర్చుల కారణాల వల్ల వీసాలను తిరస్కరిస్తోంది. 2024లో 10 లక్షలమంది విదేశీ విద్యార్థులకు కెనడా తమ దేశంలో చదువుకునేందుకు అవకాశం కల్పించింది. అందులో భారత్‌కే 41శాతం వీసాలు ఇచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం కనీసం కనీసం 3 లక్షల మందికి కూడా వీసాలు ఇవ్వలేదు. 80 శాతం వీసాలు తిరస్కరించింది.
Also Read: తాను తీసిన గోతిలో తానే..అమెరికా కంపెనీలపై ట్రంప్ సుంకాల దెబ్బ
భారీ ఎత్తున అమెరికా, కెనడా వీసాలు తిరస్కరణకు గురవుతుండటంతో భారతీయ విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎక్కువగా జర్మనీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కెనడాలో 2022లో వీసా కోసం 18 శాతం భారతీయ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా.. 2025లో మాత్రం 9 శాతానికి తగ్గింది.