/rtv/media/media_files/2025/06/07/57QoqodhywtKfmp1O2DF.jpg)
Elon musk and Trump
టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మస్క్ బాగుండాలని కోరుకుంటున్నాని ట్రంప్ అన్నారు. మీడియాతో ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. '' ప్రస్తుతం నేను చాలా బీజీగా ఉన్నాను. చైనా, రష్యా, ఇరాన్‌కు సంబంధించిన విషయాలపై పనిచేస్తున్నా. నాకు చాలా పనులున్నాయి. ఎలాన్ మస్క్ గురించి ఇప్పడు నేను ఆలోచించడం లేదు. ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాని'' ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
మరోవైపు అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలన్ మస్క్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. 'కొత్త పార్టీ పెట్టవచ్చా' అంటూ అభిమానులను ప్రశ్నించారు. దీనిపై ఓటింగ్ కూడా పెట్టారు. మస్క్ పెట్టిన ఓటింగ్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలంటూ 80శాతం మంది మద్దతు పలికారు. దీంతో తాజా కొత్త పార్టీ పేరును కూడా మస్క్ ఖరారు చేశారు. ద అమెరికన్ పార్టీ అంటూ ట్వీట్ చేశారు. అయితే మస్క్ నిజంగానే పార్టీ పెడతారని కొందరు అంటుంటే.. మరికొందరు అలా ఏం జరగదని, కేవలం అలా ట్వీట్ చేసి వదిలేస్తారని చెబుతున్నారు.
The America Party https://t.co/hO5S8Kjb5O
— Elon Musk (@elonmusk) June 6, 2025
Also Read: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్
ఇప్పటికే ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరుందని మస్క్ బయటపెట్టడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది. రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.