VIRAL VIDEO: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. గాలివానల బీభత్సం

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టించింది. గ్వాయిబా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్ 'హవాన్' ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది.

New Update
Brazil Storm

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టించింది. గ్వాయిబా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్ 'హవాన్' ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది.

Also Read :  ఆస్ట్రేలియాలో ఎప్పటినుంచో యూదు వ్యతిరేకత.. కాల్పులకు దారి తీసిన కారణాలు ఇవే !

Brazil Storm Knocks Down Statue Of Liberty

బలమైన గాలుల కారణంగా ఈ ప్రతిమ నేలకూలిపోవడం అక్కడి దృశ్యాలలో స్పష్టంగా కనిపించింది. ఈ కూలిపోయే దృశ్యాన్ని కొందరు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హవాన్ స్టోర్ చైన్ తమ వ్యాపార గుర్తుగా తమ ప్రతి స్టోర్ ముందు ఈ లిబర్టీ ప్రతిమ నకళ్ళను ఏర్పాటు చేయడం సర్వసాధారణం.

ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, కానీ విగ్రహం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో చిన్నపాటి గందరగోళం నెలకొంది. తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రతిమ కూలిపోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read :  నేటి నుంచే హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..

Advertisment
తాజా కథనాలు