/rtv/media/media_files/2025/01/26/DPVEoHgMv4zvd7Z7sww5.jpg)
Fire Accident At Hussain Sagar
ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది. రిపబ్లిక్ డే సందర్భంగా వేడుకలు చేద్దామనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు కానీ అనుకోకుండా జరిగిన సంఘటన వలన భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరత మాతకు మహా హారతి కార్యక్రమం రసాభాస అయింది. ఈ వేడుకల్లో భాగంగా బాణ సంచా కాల్చారు. ఇవి కాస్తా అదుపు తప్పి అక్కడే పక్కనే ఉన్న బూట్ల మీద పడ్డాయి. దాంతో రెండు బూట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బూట్లలో ఉన్నవారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అందులో ఉన్న 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు మరింత వ్యాపించకుండా చర్యలు తీసకుంటున్నారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, నాగఫణిశర్మ తదితరులు హాజరయ్యారు.
#WATCH | Hyderabad, Telangana | A boat catches fire in Hussain Sagar Lake. More details awaited. pic.twitter.com/5Qg1VoYdOj
— ANI (@ANI) January 26, 2025
Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
Also Read: స్టార్‌లింక్ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్