/rtv/media/media_files/2025/04/15/OFUVFXAKFVNsn8PF7BTv.jpg)
Trump and Xi jinping
చైనా, అమెరికా టారిఫ్ యుద్ధంలో తాజాగా బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. సుంకాలపై ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థలు విడిపోయేందుకు కారణాలు కనిపించడం లేదని యూఎస్ ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ అన్నారు. చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో డీల్ కష్టమేనని వ్యాఖ్యానించారు. అమెరికాకు చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థని వెల్లడించారు.
Also Read: ట్రంప్ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..
ఇదిలాఉండగా అమెరికా.. చైనా వస్తువులపై 145 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకం విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక ఆర్థిక వ్యవస్థల మధ్య ముదిరిన ట్రేడ్ వార్ ఇంకా ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన కలుగుతోంది. ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతిఘటించడం వల్ల అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల రేట్లు ఎక్కువగా ఉండనున్నాయి.
Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !
ఇక మిగతా దేశాలపై విధించిన టారిఫ్‌లను ట్రంప్ ప్రభుత్వం 90 రోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రక్షణ, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో వినియోగించే అరుదైన ఖనిజాల్లో 90 శాతం చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి చైనా వాటిని నియంత్రణ లిస్ట్‌లో చేర్చింది. ఇక అమెరికాకు ఓ అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినప్పటికీ ఆ దేశ వినియోగంలో ఎక్కువభాగం చైనా నుంచే వస్తువులు దిగుమతి అవుతున్నాయి. అయితే ఈ ఖనిజాలు, అయస్కాంతాల ఎగుమతిని చైనా నిలిపివేసినట్లు న్యూయర్క్ టైమ్స్ కథనం తెలిపింది.
Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం
china | usa | telugu-news | rtv-news