Barack Obama arrested: ఒబామా అరెస్టు.. వీడియో షేర్ చేసిన ట్రంప్.. నెట్టింట వైరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అంటూ ఉన్న ఏఐ వీడియోను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓవల్‌ ఆఫీసులో ట్రంప్, ఒబామా కూర్చోని ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఒబామాను అరెస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Obama

Obama

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అంటూ ఉన్న వీడియోను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓవల్‌ ఆఫీసులో ట్రంప్, ఒబామా కూర్చోని ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఒబామాను అరెస్టు చేస్తున్నట్లుగా ఏఐ సాయంతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చట్టానికి ఎవరూ కూడా అతీతులు కారని క్యాప్షన్ ఇచ్చారు. 

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’

ఖైదీ దుస్తులతో జైలులో..

ఫస్ట్ ఆ వీడియోలో ఒబామా చట్టానికి అధ్యక్షుడు అతీతుడే అన్నట్లు ఉంటుంది. ఆ తర్వాత చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని వస్తుంది. ఇక ఓవల్‌ ఆఫీసులో ట్రంప్‌, ఒబామా మాట్లాడుకుంటుండగా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ నవ్వుతుంటారు. దీని తర్వాత ఒబామా జైల్లో ఖైదీ దుస్తుల్లో ఉన్నట్లు కనిపించిన తర్వాత వీడియో ఎండ్ అవుతుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!

Advertisment
తాజా కథనాలు