Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి!

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి 50 మంది మరణించినట్లు సమాచారం. మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులు ప్రస్తుత తాత్కాలిక ప్రధాని అయిన యూనస్ మద్దతుదారుల మధ్య ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.

New Update
bangladesh

bangladesh

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 50 మంది మరణించగా వందల మందికి గాయాలయ్యాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులు ప్రస్తుత తాత్కాలిక ప్రధాని అయిన యూనస్ మద్దతుదారుల మధ్య ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. కోర్టు తీర్పును నిరసిస్తూ హసీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇది ఇప్పుడు రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఇది కూడా చూడండి:  India-US: ముగింపుదశకు చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య డీల్..టారిఫ్ లపై కూడా తగ్గింపు?

ఆందోళనలు చెలరేగగా..

ఆందోళనకారులను నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే చాలా మంది మరణించినట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరణ శిక్ష పడిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. హసీనాను అప్పగిస్తేనే దేశంలో అల్లర్లు తగ్గుతాయని ఆ తాత్కాలిక ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హసీనా అప్పగింత అనేది రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్యపరమైన అంశంగా మారింది. ఈ అంశంపై భారత్ తీసుకునే నిర్ణయం బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ప్రభావం చూపవచ్చు.

ఇది కూడా చూడండి: Sheikh Hasina: మరణశిక్షపై స్పందించిన షేక్ హసీనా

Advertisment
తాజా కథనాలు