/rtv/media/media_files/2025/05/28/9KeCPa1mTsoAmuaPCKRQ.jpg)
Fatima Payman : ఆడవాళ్లు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ చిన్నచూపు తప్పడం లేదని మరోమారు రుజువైంది. సాధారణ మహిళలు మొదలు కొని ఉన్నత స్థానంలో ఉన్నవారికి కూడా లైంగిక వేధింపులు తప్పడంలేదు. దీనికి ఆస్ట్రేలియా ముస్లిం సెనెటర్ అయిన ఫాతిమా పేమాన్ తాజాగా చెప్పిన ఉదంతం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
ఫాతిమా పేమాన్ ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్. కొంతకాలంగా ఆమె కొంతకాలంగా అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారారు. ఆమె 2022 నుండి పశ్చిమ ఆస్ట్రేలియాకు సెనేటర్‌గా పనిచేశారు , మొదట లేబర్ పార్టీకి ప్రాతినిథ్యం వహించారు. తరువాత స్వతంత్ర సభ్యురాలిగా , అక్టోబర్ 2024లో తన సొంత రాజకీయ పార్టీ - ఆస్ట్రేలియాస్ వాయిస్ - ను ప్రారంభించారు.ఆమె సెనేట్‌కు ఎన్నికైన మూడవ అతి పిన్న వయస్కురాలు, హిజాబ్ ధరించిన మొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలు .
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
అయితే తాజాగా పేమాన్ చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఉన్న వివక్షను ప్రతిబింభిస్తున్నాయి. అంతేకాదు ఎంత ఎత్తుకు ఎదిగిన ఆడవారికి విలువ ఇవ్వని సమాజం కళ్లముందు కనిపిస్తున్నది. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని,'టేబుల్ మీద డ్యాన్స్ చేయమని' బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించింది. ఈ వేధింపులపై తాను పార్లమెంటరీ వాచ్‌డాగ్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది.. ఎవరు చేశారనే వివరాలు బహిర్గతం చేయలేదు. కాగా, 2024లో గాజాలోని పాలస్తీనియన్లకు సహాయం చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పేమాన్.. వామపక్ష లేబర్ ప్రభుత్వం నుండి విడిపోయింది. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించారు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియాస్ వాయిస్ పేరుతో ఒక రాజకీయపార్టీని స్థాపించారు. నిజానికి ఫేమాన్ పుట్టింది ఆఫ్ఘనిస్థాన్..అయితే ఆమె తండ్రి తర్వాత ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడ్డారు.
గతంలోనూ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. 2021లో ఆస్ట్రేలియా పార్లమెంట్లో పొలిటికల్ స్టాఫర్‌గా పనిచేస్తున్న బ్రిటనీ హిగ్గిన్స్ సాక్షాత్తూ పార్లమెంటరీ కార్యాలయంలోనే అత్యాచారానికి గురైనట్లు ఆరోపించింది. తనపై సహోద్యోగి ఆఫీస్‌లో అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. తాజాగా పేమాన్ ఆరోపణలు కూడా దుమ్ము రేపుతున్నాయి.
Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే