Cyclone Alfred: తుఫాను విధ్వంసం.. అల్లకల్లోలంగా మారుతున్న ఆస్ట్రేలియా.. వీడియోలు చూశారా?

ఆల్ఫ్రెడ్ తుఫాను కారణంగా ఆస్ట్రేలియా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. దాదాపు 2.50లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

New Update
Tropical Cyclone Alfred Australia videos

Tropical Cyclone Alfred Australia videos

పసిఫిక్ మహాసముద్రంలో తలెత్తిన తుఫాను శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆస్ట్రేలియాకు చేరుకుంది. అక్కడ బ్రిస్బేన్ సమీపంలోని మోరెటన్ బే ద్వీపాన్ని తాకింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. దాదాపు 2.50 లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

ఈ తుఫాను రాబోయే 12 నుండి 24 గంటల్లో ఆగ్నేయ క్వీన్స్‌ల్యాండ్, ఉత్తర న్యూ సౌత్ వేల్స్ వైపు వెళుతుంది. అయితే దీనివల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కొందరు భావిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ తుఫాను పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి అల్బనీస్ ఆస్ట్రేలియన్ ప్రజలను హెచ్చరించారు. 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్న దాదాపు 25 లక్షల మంది దీని ప్రభావానికి లోనవుతారని.. ఇది ప్రాణాంతకం కావచ్చన్నారు. అందువల్ల ప్రజలు ఇంటి లోపలే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రమాద స్థాయికి లిస్మోర్ నది

ఇవాళ మధ్యాహ్నం నాటికి ఉత్తర న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాలకు తుఫాను చేరుకుంటుందని జాతీయ వాతావరణ సేవ అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షం, తుఫాను గాలులు, నష్టపరిచే గాలులు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటికీ ఈ తుఫాను తాకిడికి లిస్మోర్, గ్రాఫ్టన్, కాఫ్స్ హార్బర్, టెన్టర్‌ఫీల్డ్, యాంబా, వూల్‌గూల్గా, సాటెల్, డోరిగో ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. అందులో క్వీన్స్‌ల్యాండ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తుఫాను ప్రభావం నెరాంగ్‌లో ఎక్కువగా కలిగింది. అక్కడ దాదాపు 6,000 మంది ప్రజలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. 

Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు