Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ

తెలంగాణలో వరుసగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. 2024లో 11 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించగా ఈసారి మరో 6 వేల పోస్టులు భర్తీ చేయనుంది. ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
DSC Posts

DSC Posts

తెలంగాణలో వరుసగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. గతేడాది టెట్, డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మరో టెట్, డీఎస్సీని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2024లో 11 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించగా ఈసారి మరో 6 వేల పోస్టులు భర్తీ చేయనుంది. ఫిబ్రవరి నెలలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వివిధ సందర్భాల్లో ప్రకటించారు.  

Also Read: ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్ట్‌ హతం!

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను విద్యాశాఖ గుర్తించింది. మొత్తంగా 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందు పలు అంశాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో టీచర్ల రేషనలైజేషన్ విధానం జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత ఎస్సీ కోటా ఏ మేరకు కేటాయించాలని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే ఫిబ్రవరిలో విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ అంశాలు పరిగణలోకి తీసుకుంటారా ? లేదా ? అనేది కూడా స్పష్టత లేదు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ రెండుసార్లు టెట్‌, ఒకసారి డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. విద్యాశాఖలో ఎలాంటి ఖాళీలు లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. 

Also Read: ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!

ఇదిలాఉండగా.. ఇటీవలే టెట్ పరీక్షలు జరిగాయి. జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 2 లక్షల 5 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఫిబ్రవరిలో రానున్న ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ? ఏ కేటగిరి పోస్టులు ఉన్నాయి వంటి అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు