Asia Cup : ఆసియా కప్‌ వివాదం..ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్న బీసీసీఐ

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకొనేందుకు భారత్‌ అంగీకరించలేదు. యూఏఈ లేదా ఇతర సభ్యుల నుంచి దాన్ని తీసుకుంటామని తేల్చి చెప్పింది.

New Update
India Vs Pakistan Asia Cup 2025 Final After 41 Years

India Vs Pakistan Asia Cup 202

 Asia Cup : ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకొనేందుకు భారత్‌ అంగీకరించలేదు. యూఏఈ లేదా ఇతర సభ్యుల నుంచి దాన్ని తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయినా సరే మోసిన్ మొండిపట్టుదలతో ట్రోఫీని తీసుకుని.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఈ అంశంపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఐసీసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మరొకసారి ఏసీసీఅధ్యక్షుడు మోసిన్‌కు బీసీసీఐ మరోకసారి వార్నింగ్‌ ఇచ్చింది. ఆసియా కప్‌ ట్రోఫిని అప్పగించకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఈమెయిల్‌ పంపినట్లు బీసీపీఐ తెలిపింది. ఏసీసీ చీఫ్‌ నుంచి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోతే అధికారిక మెయిల్ ద్వారా ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేస్తామని బోర్డు కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఈ ప్రక్రియలో తాము దశలవారీగా ముందుకు సాగుతున్నామని, ట్రోఫీని భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు.

Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?

ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు నిరాకరించడంతో  మోసిన్‌ ఆ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోయాడు. భారత జట్టుకు నఖ్వీ క్షమాపణలు చెప్పినా ఆ ట్రోఫీని మాత్రం ఇంకా అప్పగించలేదు. బీసీసీఐ లేదా టీమిండియా కెప్టెన్‌ నేరుగా తన దగ్గరకు వచ్చి ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో నఖ్వీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌ పదవి నుంచే తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం గమనార్హం. ఈ మేరకు ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.

 పాకిస్థాన్‌ వన్డే జట్టు నూతన కెప్టెన్‌గా షాహిన్‌ షా అఫ్రిదీ 

ఇక పాక్‌ క్రికెట్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.  పాకిస్థాన్‌ వన్డే జట్టు నూతన కెప్టెన్‌గా షాహిన్‌ షా అఫ్రిదీ నియమించింది. అతడు గత సారథి మహ్మద్ రిజ్వాన్‌ నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించాడు. ఆటలోనే కాదు.. కెప్టెన్సీ విషయంలోనూ పాక్‌ జట్టులో నిలకడ లోపిస్తోందని తెలుస్తోంది. 12 నెలల వ్యవధిలో ఆ టీమ్‌కు ముగ్గురు కెప్టెన్లు మారడమే దీనికి నిదర్శనం. దీంతో ఆ దేశ క్రికెట్‌ అభిమానుల్లో అసహానం నెలకొంది. పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీ ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఒంటెద్దు పోకడలతో కెప్టెన్సీ కుర్చీలాటకు తెరలేపాడని వారు ఆగ్రహిస్తున్నారు. ఆసియా కప్‌ నేపథ్యంలోనూ ఏసీసీ ఛైర్మన్‌గా నఖ్వీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. టోర్నీ విజేతగా నిలిచిన భారత్‌కు కప్‌, మెడల్స్‌ ఇవ్వకుండా.. తనతోపాటు హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి పిల్లచేష్టలతో పరువు పోగొట్టుకున్న వైనం ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల కళ్లముందే కదలాడుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ వన్డే జట్టు కెప్టెన్సీ మార్పుతో నఖ్వీ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.   

  Also read : HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!

Advertisment
తాజా కథనాలు