/rtv/media/media_files/2025/05/03/4oH0CCobrydITpLa2iQl.jpg)
Pak Army At POK
ఆయింట్‌మెంట్లు ఎలా రాయాలి, స్ట్రెచర్‌పై ఎవరినైనా ఎలా తీసుకెళ్లాలి, మంటలను ఎలా ఆర్పాలి...ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పిల్లలు నేర్చుకుంటున్న పాఠాలు. పాకిస్తాన్ కు యుద్ధ భయం బాగా పట్టుకుంది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అని వణికిపోతోంది. దాని కోసం అన్ని రకాలుగా సిద్ధం అవుతోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రాంతాల్లో అధికారులు యుద్ధానికి సంబంధించి ముందస్తు చర్యలు వేగవంతం చేశారు.ఈక్రమంలో అక్కడి ముజఫరాబాద్ తో పాటూ మరి కొన్న ప్రాంతాల్లో పిల్లలకు చదువులు చెప్పే మదర్సాలు మూత బడ్డాయి.
యుద్ధ సన్నాహాలు..పిల్లలకూ తప్పని శిక్షణ
పీవోకేలో దాదాపు 1000 మదర్సాలను మూసేశారు. దాని స్థానంలో పిల్లలకు అత్యవసర సేవల్లో శిక్షణ ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. ఆయింట్‌మెంట్లు ఎలా రాయాలి, స్ట్రెచర్‌పై ఎవరినైనా ఎలా తీసుకెళ్లాలి, మంటలను ఎలా ఆర్పాలి లాంటివి నేర్పిస్తున్నారని చెబుతున్నారు. యుద్ధం కనుక జరిగితే అందులో గాయపడిన సైనికులను సవ చేయాల్సి ఉంటుంది. అంతే కాదు పీవోకేలో ఉన్న ప్రజలకు ఏమైనా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైమ్ లో అందరికీ అన్నీ తెలిస్తే ఉపయోగంగా ఉంటుందని స్థానిక అధికారుల ఆలోచన. ఇందులో భాగంగానే పిల్లలకు అత్యవసర సేవలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అలాగే పహల్గామ్ దాడి తర్వాత భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని PoKలోని పౌరులకు సూచనలు జారీ చేసినట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. 13 నియోజకవర్గాలకు ఆహారం, మందులతో సహా అవసరమయ్యే అన్ని అవసరాల సరఫరాల కోస ప్రాంతీయ ప్రభుత్వం ఒక బిలియన్ రూపాయల ($3.5 మిలియన్లు) అత్యవసర నిధిని కూడా సృష్టించిందని ఆయన వెల్లడించారు.
today-latest-news-in-telugu | pakistan | children
Also Read: MH: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్