మయన్మార్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూప్ కంట్రోల్‌లో ఉన్న గ్రామంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక స్వచ్ఛంద సంస్థ అధికారులు తెలిపారు. పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని అరకాన్ ఆర్మీ ఆధినంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై ఈ దాడి జరిగినట్లు తెలిపారు. వందల ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. Also Read: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి! దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో ఇంటర్నెట్ సర్వీసులు, మొబైల్ సిగ్నల్ సేవలు కూడా నిలిపివేశారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో సైన్యం దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూచి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడి సైన్యం అధికారం లాక్కుంది. దీంతో అప్పటినుంచి సైనిక పాలనను వ్యతిరేంచేవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. Also Read: ఈ నెలలోనే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం: ఉత్తరాఖండ్ సీఎం ఎవరైనా సైన్యానికి ఎదురుతిరిగితే వాళ్లని అణిచివేసేందుకు పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నారు. శాంతియుత చేసే నిరసనలను కూడా అణిచివేస్తున్నారు. దీంతో చాలామంది సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ఆయుధాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సైన్యం వాళ్లపై మరింత దురాగతాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ గ్రామంపై వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో 40 ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. దీంతో అక్కడ పరిస్థితులు ఇంకా ఎలాంటి తీవ్రతకు దారితీస్తాయో అనేదానిపై ఆందోళన నెలకొంది. Also Read: చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్ Also Read: వీడు మామూలు 'గే' కాదు : 11 మందిని దారుణంగా.. వీపుపై ద్రోహి అని రాసి!