వీడు మామూలు 'గే' కాదు : 11 మందిని దారుణంగా.. వీపుపై ద్రోహి అని రాసి!

ఇప్పటి వరకు మనం చాలా మంది సైకో కిల్లర్లను చూశాం కానీ వీడు మాత్రం చాలా డిఫరెంట్. పై ఫోటోలో కనిపిస్తు్న్న ఇతని పేరు  రాంస్వరూప్, పురుషుడు కాదు స్త్రీ కాదు.. గే..  వయసు 33 ఏళ్లు. ఇప్పటివరకు 11 మందిని చంపేశాడు. ఇతడి కేసులో ట్విస్ట్ ఏంటంటే..  ఇతడికి మతిమరుపు

New Update
punjab killer

punjab killer Photograph: (punjab killer)

ఇప్పటివరకు మనం చాలామంది సైకో కిల్లర్లను చూసి ఉంటాం కానీ వీడు మాత్రం చాలా డిఫరెంట్. పై ఫోటోలో కనిపిస్తు్న్న ఇతని పేరు  రాంస్వరూప్, పురుషుడు కాదు స్త్రీ కాదు.. గే..  వయసు 33 ఏళ్లు. ఇప్పటివరకు 11 మందిని చంపేశాడు. చంపడంలో కూడా మనోడి మార్క్ కూడా ఉంటుంది.  చంపగానే చనిపోయిన వాళ్ల కాళ్లు, చేతులు పట్టుకుని క్షమించమని కోరుతాడు.  ఆ తరువాత వాళ్ల వీపు వెనకాల ద్రోహి అని రాసి వెళ్తాడు. ఇతడి కేసులో ఉన్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే..  ఇతడో మతిమరుపు సీరియల్ కిల్లర్... అవును.. ఇప్పటివరకు 11మందిని చంపాడు కానీ వాళ్ల ఫేసులే మనోడికి అంతగా గుర్తుండవు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకటి హత్య చేసి చనిపోయిన వ్యక్తి వెనుక ద్రోహి అని రాయడం, రెండోది హత్య చేసిన వ్యక్తి కాళ్లు రెండు చేతులతో పట్టుకుని క్షమాపణ కోరడం..ఈ రెండు ప్రతి హత్యలో కచ్చితంగా ఉంటాయి. ఇంతకీ ఎవడీ  గే సీరియల్ కిల్లర్.  

పంజాబ్‌లోని ఈ అతిపెద్ద సీరియల్ కిల్లర్ రామ్ స్వరూప్ పూర్తి కథను తెలుసుకునే ముందు..  నాలుగు నెలల క్రితం జరిగిన ఓ హత్య గురించి తెలుసుకోవాలి.  2024 ఆగస్టు 18న కిరాత్‌పూర్ సాహిబ్‌లోని గర్ మోడా టోల్ ప్లాజా దగ్గర టీ స్టాల్ నడుపుతున్న 37 ఏళ్ల ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య తర్వాత హంతకుడు అతని మొబైల్ ఫోన్‌ను కూడా తన వెంట తీసుకెళ్లాడు. ఆ తరువాత ఈ మొబైల్ సహాయంతో పోలీసులు ఒక వ్యక్తి వద్దకు  చేరుకున్నారు. అయితే ఈ మొబైల్‌ను తనకు వేరే వ్యక్తి అమ్మినట్లుగా పోలీసులు తెలుసుకున్నారుజ. ఆ వ్యక్తి వివరణ ఆధారంగా విచారణ చేపట్టిన పంజాబ్ పోలీసులు అతడి స్కెచ్‌లు వెయించారు.  ఆ స్కెచ్ ఆధారంగా పోలీసులు రాంస్వరూప్‌ను అదుపులోకి తీసుకున్నారు. కథ ఇంతటితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది.  

రాంస్వరూప్ సీరియల్ కిల్లర్‌గా ఎలా మారాడు? రాత్రి అయిన వెంటనే అతను స్త్రీ వేషంలో ఎందుకు మారుతాడు. అతని చేతిలో మరణించిన వ్యక్తులు ఎవరు? అనే విషయాలపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.  
రాంస్వరూప్ స్వలింగ సంపర్కుడు అంటే గే అన్నమాట. సెక్స్ వర్కర్ కూడా. అందుకే మామూలుగా రాత్రి పూట స్త్రీల వేషం వేసుకుని వీధుల్లోకి వెళ్లి కస్టమర్ల కోసం వెతుకులాటలో ముఖానికి ముసుగు వేసుకునేవాడు.  మద్యం సేవించాకే కస్టమర్ల వద్దకు వెళ్లేవాడు.  అయితే పని అయిపోయాక డబ్బుల విషయంలో కస్టమర్లతో గొడవ జరిగినప్పుడల్లా మఫ్లర్‌తో గొంతునొక్కి చంపేవాడు, డబ్బుల విషయంలో ఇలాంటి గొడవలు చాలాసార్లు జరిగాయి. ఎప్పుడు గొడవ పడితే అప్పుడు ఎదుటి వ్యక్తిని చంపేసేవాడు రాంస్వరూప్.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ స్వరూప్ గత ఏడాదిన్నర కాలంలో రూప్‌నగర్, ఫతేఘర్ సాహిబ్, హోషియార్‌పూర్ ప్రాంతాల్లో మొత్తం 11 హత్యలకు పాల్పడ్డాడు. అయితే అన్నిచోట్లా జరిగిన హత్యలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రాంస్వరూప్ 5 హత్యలు చేసినట్లుగా నిర్ధారణ అయింది. మిగిలిన హత్యలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం రాంస్వరూప్ ఖచ్చితంగా స్వలింగ సంపర్కుడే. కానీ నపుంసకుడు కాదు. రాంస్వరూప్‌కు చిన్నప్పటి నుంచి అమ్మాయిల బట్టలు వేసుకోవడం, మేకప్ చేయడం అంటే చాలా ఇష్టం. తల్లితండ్రులకు తెలియకుండా ఇంట్లోనే మేకప్ వేసుకునేవాడు.

దుబాయ్ వెళ్లి గేగా 

రోపర్‌లోని ఓ గ్రామానికి చెందిన రాంస్వరూప్ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు.  ఆ తర్వాత దుబాయ్ వెళ్లాడు. దుబాయ్‌లో కొంత కాలం ఉన్నాడు. అక్కడే తొలిసారి స్వలింగ సంపర్కుడిగా మారాడు. తర్వాత అతని కుటుంబ సభ్యులు పెళ్లి చేయగా..  అతనికి ముగ్గురు సంతానం కలిగారు.  పెళ్లి తర్వాత రాంస్వరూప్ ఉద్యోగం కోసం ఖతార్ వెళ్లాడు.  5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతో గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు. బంధువుల అప్పులు తీర్చి మళ్లీ  పంజాబ్‌కు వచ్చాడు. ఖతార్ నుంచి వచ్చిన తర్వాత రాంస్వరూప్ జీవితం మారిపోయింది. పని వదిలేసి రోజంతా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై తల్లిదండ్రులు, భార్యతో తరచూ గొడవపడేవాడు. ఒకసారి కూడా అతని తండ్రిని కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఇంటి నుండి గెంటేశారు. దీని తర్వాత గత ఏడాదిన్నరగా అతని బ్లడీ గేమ్ మొదలైంది. తాగుడుకు బానిసైన రామ్ స్వరూప్ ఇలాంటి హత్యలకు పాల్పడటం మొదలుపెట్టాడు. 

Also Read  :  మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. విందు భోజనంలో విషం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు