/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
Earthquake in Greece
Earthquake in Greece: ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ లో భారీ మరోసారి భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్(German Research Center for Geosciences) తెలిపింది. భూ అంతర్భాగంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. వారం రోజుల ముందే గ్రీస్‌లో భూకంపం సంభవించింది. తిరిగి బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు (ఈస్టర్న్ యూరోపియన్ టైమ్) ప్రకారం గ్రీస్‌లోని కాసోస్ దీవి సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం ఫ్రై, గ్రీస్‌కు ఆగ్నేయంగా 14 మైళ్ల దూరంలో 62.5 కి.మీ లోతులో సంభవించినట్లుగా పేర్కొంది.
Also Read: IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం
సునామీ(Tsunami) హెచ్చరికలు
ఇక గ్రీస్‌లోని క్రీట్, రోడ్స్, కోస్, తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగనట్లుగా తెలుస్తోంది. మరోవైపు భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.గ్రీస్ మంత్రిత్వ శాఖ క్లైమేట్ క్రైసిస్ అండ్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ కార్పాథోస్ , కాసోస్‌లలో నివాసం ఉండే ప్రజలకు తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలంటూ సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గ్రీస్ ఎర్త్‌క్వేక్ ప్లానింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎఫ్తిమియోస్ లెక్కాస్ మాట్లాడుతూ.. భూకంపం లోతు కారణంగా ఉపరితలంపై ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు.
Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
భూకంపం ఇది రెండోసారి
కాగా, పది రోజుల వ్యవధిలోనే గ్రీస్‌లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈనెల 14న కూడా గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.ఈ భూప్రకంపనల ప్రభావంతో గ్రీస్ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్, తుర్కియే, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్
Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం