/rtv/media/media_files/2025/09/16/india-us-2025-09-16-08-42-06.jpg)
అమెరికా అధ్యక్షుడు ఒక్క పోస్ట్ తో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది దాదాపు నాలుగు నెలలుగా యూఎస్ , భారత్ ల మధ్య నెలకున్న ఉద్రిక్తతలు కరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య సమస్యల ఉద్రిక్తత నడుస్తోంది. వీటిపై తన పరిపాలనా విభాగం ఆల్రెడీ ఇండియాతో చర్చలు చేస్తోందని ట్రంప్ తెలిపారు. అది కాక వచ్చే రెండు , మూడు వారాల్లో తానే స్వయంగా భారత ప్రధాని మోదీ(PM Modi) తో మాట్లాడతానని చెప్పారు. మోదీ తనకు మంచి స్నేహితుడని..ఆయనతో మాట్లాడ్డానికి ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. రెండు దేశాలకు విజయవంతమైన ముగింపుకు వస్తాయని అన్నారు. దానికి భారత ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. తాను కూడా ట్రంప్ తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానంటూ ట్వాట్ చేశారు. భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు దేశాలు మరోసారి వాణిజ్య చర్చలకు సిద్ధం అవుతున్నాయి.
త్వరలోనే అమెరికా ప్రతినిధి బృందం ఢిల్లీకి..
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న అమెరికా ప్రతినిధుల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. త్వరలోనే వారు వాణిజ్య చర్చల కోసం ఢిల్లీకి రానున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలో అధికారులు వస్తున్నారు. మన దేశం తరఫు నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి రాజేష్ అగర్వాల్ వాణిజ్య చర్చలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే వారు ఎప్పుడు వస్తారన్నది మాత్రం ఇంకా డేట్ కన్ఫార్మ్ కాలేదు. త్వరలోనే ఢిల్లీకి పర్యటిస్తారని సమాచారం.
ధృవీకరించిన వాణిజ్య సలహాదారు నవారో..
మరోవైపు మొన్నటి వరకు భారత్ పై నోరు పారేసుకున్న ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి ట్వీట్ చేశారని...దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారని తెలిపారు. వాటికి ప్రతిఫలమే ఇప్పుడు అమెరికా ప్రతినిధుల బృందం వాణిజ్య చర్చల కోసం న్యూ డిల్లీ వస్తోందని చెప్పుకొచ్చారు.
అంతకు ముందు రెండు రోజుల క్రితం ట్రంప్ సన్నిహితుడు, వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్శనల్ ఆఫీస్ డైరెక్టర్ సెర్గియోగోర్ భారత్, అమెరికా వాణిజ్య చర్చ(india us trade war) లపై మాట్లాడారు. భారత రాయబారిగా తాను వచ్చే లోపునే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పారు. రాబోయే రెండు, మూడు వారాల్లో అన్ని విషయాలు సద్దుకుంటాయనిగోర్గ్ తెలిపారు. దాంతో పాటూ సుంకాల విషయంలో కూడా రెండు దేశాలు ఒక ఒప్పందానికి వస్తాయని చెప్పారు. రీసెంట్ గా భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో తేడాలువచ్చాయని..కానీ ఇరు దేశాలు వ్యూహాత్మకంగా కలిసే ఉన్నాయని గోర్గ్ తెలిపారు.
Also Read: BIG BREAKING: ఉత్తరాఖండ్లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్.. మునిగిన డెహ్రాడూన్