/rtv/media/media_files/2025/01/24/S0XFleuPClQZCBySaTth.jpg)
USA Congress
అక్ర వలసదారులపై ఉక్కు పాదం మోపుతానని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ చెబుతున్నారు. అన్నట్టుగానే అధ్యక్షుడు అయిన వెంటనే అక్రమ వలసదారుల నిర్భంధ బిల్లును తీసుకువచ్చారు. దానికి తగ్గట్టుగానే 1500 మంది సెక్యూరిటీని కూడా మెక్సికో బోర్డర్ దగ్గరకు పంపించారు కూడా.
సెనేట్ ఆమోదం...
అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇప్పుడు దాని గురించి మరో అడుగు ముందు వేశారు కూడా. ఈ విషయంలో ఇప్పుడు ట్రంప్ కు మొదటి విజయం కూడా లభించింది. ఈ కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌లోని మొత్తం 263 మంది సభ్యుల్లో బిల్లుకు 156 మంది మద్దతు తెలిపారు. వీరిలో 46 మంది డెమొక్రాట్లు ఉన్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసే మొదటి బిల్లు అక్రమవలసదారులదే కానుంది. ఇది అమల్లోకి వస్తే..సరైన పేపర్లు లేకుండా అమెరికాలో ఉంటున్న ఏ దేశస్థులు అయినా తమ స్వదేశాలకు వెళ్ళాల్సిందే. దీనివలన అమెరికాలో చోరీలు, దోపిడీలు, తీవ్రమైన నేరాలు పాల్పడే వారిని కంట్రోల్ చేయవచ్చని భావిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని అంటున్నారు.
మరోవైపు డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుని ట్రంప్ కు షాకిచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ ప్రకారం అమెరికాకు వలస వెళ్లిన వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు.
Also Read: Indore: మంచి చేశా అనుకున్నాడు కానీ ..అడ్డంగా బుక్కయ్యాడు