BIG BREAKING: ‘ట్రంప్ చనిపోయాడు’ వార్తలపై వైట్‌హౌస్ క్లారిటీ

సోషల్ మీడియాలో ట్రంప్ చనిపోయాడని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ట్రంప్‌ చనిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్‌లో TRUMP IS DEAD హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ట్రంప్‌ మరణ వార్తలపై వైట్ హౌస్ స్పందించింది.

New Update
White House clarifies

White House clarifies

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత మూడు రోజులుగా కనిపించడం లేదు. ఎప్పుడు సంచలన నిర్ణయాలతో  మీడియా ముందుకు వచ్చే ట్రంప్ కొన్ని రోజులుగా కనుమరుగైయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ చనిపోయాడని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ట్రంప్‌ చనిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్‌లో TRUMP IS DEAD హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ట్రంప్‌ మరణ వార్తలపై వైట్ హౌస్ స్పందించింది.

ట్రంప్ చనిపోలేదు, బతికే ఉన్నారని అమెరికా అధ్యక్ష అధికారిక భవనం వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. వర్జీనియాలో గోల్ఫ్‌ కోర్స్‌లో ట్రంప్ గోల్ఫ్‌ ఆడుతున్న ఫోటోను వైట్‌ హౌస్‌ అధికారులు పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో పోలో టీషర్ట్, రెడ్ కలర్ MAGA క్యాప్‌.. బ్లాక్ ప్యాంట్‌ ధరించి ట్రంప్ ఉన్నాడు.

దీంతో మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రంప్ చనిపోయాడని వస్తున్న వార్తలకు చెక్ పడనుంది. భారత్‌పై సుంకాలు అమలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి తరుచూ మీడియా ముందు వస్తున్న ట్రంప్.. ఇటీవల మీడియా ముందుకు కూడా రాకపోవడంతో ఈ అనుమానాలు వ్యాపించాయి.

Advertisment
తాజా కథనాలు