/rtv/media/media_files/2025/12/20/america-2025-12-20-10-44-41.jpg)
america
సిరియా(syria)లోని ఇస్లామిక్ స్టేట్(islamic-states) తీవ్రవాదులే లక్ష్యంగా అమెరికా బలగాలు భారీ స్థాయిలో వైమానిక దాడులను(America Attacks) నిర్వహించాయి. ఈ నెలలో పాల్మిరాలో అమెరికన్, సిరియా దళాల కాన్వాయ్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే సిరియాపై దాడులు చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రకటించింది. ఉగ్రవాదుల కదలికలు శిక్షణా శిబిరాలపై నిఘా ఉంచిన అమెరికా సెంట్రల్ కమాండ్, సరైన సమయం చూసి క్షిపణులతో దాడులు జరిపింది.
ఇది కూడా చూడండి: BEAKING: తెలంగాణలో దారుణ హత్య.. కత్తులు స్కూడ్రైవర్లతో పొడిచి..
AMERICAN JETS, HELICOPTERS UNLEASH MASSIVE STRIKES ACROSS SYRIA.
— Alma Gentil (@Chinoy200096633) December 19, 2025
ghostpatriot pic.twitter.com/Ck8SMbofBa
ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఐసిస్ సామర్థ్యాన్ని దెబ్బతీసి, ఆ ప్రాంతంలో తమ బలగాల భద్రతను నిర్ధారించుకోవడానికి జరిపినట్లు తెలిపింది. అయితే అమెరికా జరిపిన ఈ దాడుల్లో ఐసిస్ ఉగ్రవాదులకు చెందిన శిక్షణా కేంద్రాలు, ఆయుధ డిపోలు, కమ్యూనికేషన్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే సిరియాలోని పలు రహస్య ప్రాంతాల్లో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడులలో అనేకమంది ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా తమ సైనికుల ప్రాణాలకు హాని తలపెట్టే ఏ శక్తీని వదిలిపెట్టబోమని అమెరికా ఈ దాడుల ద్వారా హెచ్చరించింది.
ప్రతీకారంగా ఈ దాడులు..
అమెరికా సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు, రక్షణ శాఖ అధికారులు తమ సైనికుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై శాంతి భద్రతల కోసం పనిచేస్తున్న తమ బలగాలపై దాడులను ఏమాత్రం సహించబోమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికన్ల రక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తమ పౌరులపై దాడికి పాల్పడిన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని శిక్షిస్తామని ఈ దాడుల ద్వారా మరోసారి నిరూపించారు.
Follow Us