/rtv/media/media_files/2025/06/22/31-tolas-gold-stolen-from-a-house-in-bhainsa-2025-06-22-15-07-08.jpg)
31 tolas gold stolen from a house in Bhainsa, Nirmal District
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగింది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడి టారీఫ్ ల గోల. నిన్న భారత్ పై 25 శాతం అదనపు సుంకాలను ప్రకటించారు ట్రంప్. అంతకు ముందు 25 శాతం...అదనంగా 25శాతం కలిపి ఇప్పుడు మొత్తం భారత్ పై 50 శాతం టారీఫ్ ల దెబ్బ పడింది. దీంతో చాలా వాటికి రేట్లకు రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా పడింది. రోజంతా అటూ ఇటూ ఊగిసలాడుతూనే ఉంది. మదుపర్లు కూడా తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీని కారణంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని రోజులుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వీటి ధరలు ఇప్పుడు మళ్ళీ కొండెక్కి కూర్చొన్నాయి.
ఆల్ టైమ్ రికార్డ్ ధరలు..
బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఒకేరోజు రూ.3,600 మేర పెరిగి రూ.1.02,620 వద్ద రికార్డు స్థాయికి చేరింది. హైదరాబాద్ లో కూడా 10 గ్రాముల బంగారం రూ. 1.03 లక్షలు పలుకుతోంది. దీంతో పాటూ వెండి ధర కూడా బాగా పెరిగింది. కిలోకు రూ.1500 పెరిగి 1.14 లక్షలకు చేరింది. ఇక అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 3,379 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 38.34 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పరిస్థితులు, అనిశ్చితులూ ఈ మార్పుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. గాజాను స్వాధీనం చేసుకోవడమే టార్గెట్..
మరోవైపు రష్యాతో ఆర్థిక సంబంధాలు తెంచుకునే వరకూ దేశాలపై వత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో వచ్చే వారం రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరిగి, ఒప్పందం కుదిరితే..భారత్ పై సుంకాలు తగ్గవచ్చా అని విలేకరులు అడిగారు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ..దానిని తరువాత నిర్ణయిస్తామని చెప్పారు. మరి చైనా సంగతేంటి అని అడగ్గా..ఆ దేశంపైనా సుంకాలు విధిస్తాయని సూచించారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని ముగించడానికి రష్యాపై ఒత్తిడిని పెంచే అదనపు ఆంక్షలు మరిన్ని ఉంటాయని ఆయన అన్నారు. భారత్ లాగే మరికొన్ని దేశాలపై కూడా టారీఫ్ లు విధిస్తాము..అందులో చైనా కూడా ఉండవచ్చని ట్రంప్ తెలిపారు. దీని ప్రభావం మరింతగా భారత మార్కెట్ల మీద పడొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వివరాలు ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సవాల్