Airtel: ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం..

ఎయిర్‌టెల్‌ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌ యూజర్లు మొబైల్ డేటా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

New Update
Airtel

Airtel

ఎయిర్‌టెల్‌ సేవలకు(Airtel Services) సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌ యూజర్లు మొబైల్ డేటా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వాయిస్‌ సర్వీసెస్ కూడా పనిచేయలేదు. సాయంత్రం 4.04 PM గంటలకు 2300 మందికి పైగా యూజర్లు తమ సేవలకు అంతరాయం కలగడంపై ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్‌ పేర్కొంది. అయితే సేవలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ వెల్లడించింది. 

Also Read :  ప్రధాని మోదీకి ఫోన్ చేసిన పుతిన్‌.. ఏం మాట్లాడారంటే ?

Airtel Services Down

చాలామంది యుజర్లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌(Airtel Network) పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా మొబైల్ రీచార్జ్‌ చేసుకున్నప్పటికీ మొబైల్‌ డేటా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో ఇలా నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడంపై మండిపడుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ యూజర్లు సిగ్నల్స్ రాకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read :  ఖరీదైన వినాయకుడు... గణపయ్యకు రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌

Advertisment
తాజా కథనాలు