Air Pollution Deaths: గాలి కాలుష్యంతో 81లక్షల మంది మృతి
2021లో ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం కారణంగా 81 లక్షల మంది చనిపోయారని, ఇందులో భారత్లో 21 లక్షల మరణాలు నమోదయ్యాయని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఐ) నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో 12 శాతం వాయు కాలుష్యం వల్లనేనని వివరించింది.