AI: ఏఐతో కష్టమే, భారీ నష్టం తప్పదు..బిల్ గేట్స్, ఒబామా

ఏఐతో కష్టమే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. దీని వలన చాలా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత నష్టం ఏఐతో సంభవిస్తుందని బిల్ గేట్స్ అంటున్నారు.  

New Update
ai

Bill gates, Obama

కృత్రిమ మేథ...ఇప్పుడు ఇదెంత మామూలు అయిపోయిందంటే..చిన్నపిల్లలు కూడా దీంతో ఆరేసుకుంటున్నారు. చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ ఇలా.. ఒకటేమిటి..పుట్టలుగా ఏఐ డొమైన్స్ పుట్టుకొస్తున్నాయి. ఎన్ని వచ్చినా జనాలు వాటిని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇవి చాలా పనులను ఈజీ చేసేస్తున్నాయి. దీంతో మనుషుల కంటే ఏఐ బెటర్ అనే ఫీలింగ్ కు వచ్చేస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించి కృత్రిమ మేథ ద్వారా పనులు చేయించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏఐ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Also Read :  ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

భారీ నష్టం తప్పదు..

కృత్రిమ మేథ వలన అపార నష్టం జరుగుతుంది అంటున్నారు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్. దీని వలన కోట్లాది ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఆ సంక్షోభం ఏ స్థాయిలో ఉంటుందంటే.. గత వందేళ్లలో ఎప్పుడూ చూడనంత భారీగా ఉంటుందని మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఏఐ మీద తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  భవిష్యత్తులో వైద్యం, టీచింగ్ వంటివి కూడా ఏఐ ద్వారా సామాన్యులకు అందుబాటులో వచ్చేస్తాయని బిల్ గేల్స్ అన్నారు. రానున్న కాలంలో చాలా సమస్యలను కృత్రిమ మేధ పరిష్కరిస్తుందని, కొత్త ఆలోచనలకు రూపమిస్తుందని చెబుతూనే దీని కారణంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పలేని అనిశ్చితి ఉందని, అదే చాలా భయం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read :  అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!

ఇప్పటివరకు ఏ టెక్నాలజీ వల్ల రాని మార్పులు భవిష్యత్తులో ఏఐ వల్ల వస్తుందని ఒబామా అంటున్నారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ వేగం పుంజుకుని, అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో ప్రజలు తమ జీవనోపాధి గురించి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏఐను వాడే అత్యున్నతస్థాయి నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాలు తప్ప.. మిగతావారి ఉద్యోగాలు పోతాయని ఒబామా జోస్యం చెప్పారు.  వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని అన్నారు.  అలాగే సాంప్రదాయ ఉద్యోగావకాశాల్లోనూ కోత పడుతుందని చెప్పారు. 

today-latest-news-in-telugu | ai-technology | bill-gates | barack-obama

Also Read: Stock Market: 5రోజుల లాభాల పరుగుల తర్వాత నెమ్మదించిన దేశీ స్టాక్ మార్కెట్లు

Also Read :  మరోసారి వింటేజ్ కాంబో.. బాలయ్య సినిమాలో విజయశాంతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు