/rtv/media/media_files/2025/09/23/us-2025-09-23-14-40-56.jpg)
After steep H-1B fee hike, techies eye L-1, O-1 visa route to the US
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం హెచ్1 బీ వీసా ఫీజులు లక్ష డాలర్లకు(రూ.88 లక్షలు) పెంచిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా హెచ్1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే చాలామంది భారతీయులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే హెచ్1 బీ వీసా అనేది అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఒక మార్గం మాత్రమే. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. హెచ్1 బీ కాకుండా ఎల్1, ఓ1 వీసాలు కూడా కీలకమైనవే.
ప్రస్తుతం పెరిగిన హెచ్1బీ వీసా ఫీజులతో పోలిస్తే ఈ వీసా ఫీజులు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి ఎంపిక విధానాలు మాత్రం కాస్త కఠినంగా ఉంటాయి. వీటి కోసం దరఖాస్తు చేస్తే వీసా వచ్చే ఛాన్సులు కూడా హెచ్1బీతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. ఓ1 వీసా కోసం 12 వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వీసాను జారీ చేసేందుకు ఎలాంటి పరిమితి, లాటరీ విధానం అనేది ఉండదు. ఇప్పటిదాకా ఉన్న గణాంకాలను చూస్తే దరఖాస్తు చేసినవాళ్లలో 93 శాతం మందికి వచ్చింది. హెచ్1బీకి వచ్చిన అప్లికేషన్లలో చూస్తే 73 శాతం రిజెక్ట్ అయ్యాయి.
Also Read: నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!
L1 వీసాల
ఈ వీసాలను బహుళ జాతి కంపెనీలు విదేశీ బ్రాంచుల నుంచి అమెరికాలో ఉండే బ్రాంచుల్లో పనిచేసేందుకు ఎగ్జిక్యూటివ్, మేనేజర్లు ఎల్1ఏ, ఇంకా ఆయా రంగంలో పనిచేసే నిపుణుల ఎల్1బీ రకం వీసాలు అందిస్తారు. అయితే ఈ కంపెనీ విదేశీ శాఖలో ఆ ఉద్యోగం ఏడాది పాటు చేసి ఉండాలి. దరఖాస్తు చేసిన నాటికి మూడేళ్లలోనే చేయాలి. అలాగే ఆ కంపెనీ పేరెంట్ సబ్సిడరీ బ్రాంచ్‌కి కూడా సంబంధం ఉండాలి. ఈ వీసా వస్తే భవిష్యత్తులో ఈబీ1సీ గ్రీన్‌కార్డు కూడా పొందే అవకాశం ఉంటుంది. L1బీ కింద వచ్చేవారు ఆ రంగంలో నిపుణుడు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా జారీ చేసిన ఎల్1 వీసాల్లో 26 భారతీయులకే వచ్చాయి.
Also Read: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ఓ1 వీసా
విద్యారంగం, బిజినెస్, సైన్స్, ఆర్ట్స్, అథ్లెటిక్స్‌లోని ప్రతిభావంతులకు ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇస్తుంటారు. టీవీ, ఫిల్మ్ రంగంలో ప్రతిభావంతులకు కూడా ఇస్తుంటారు. అయితే ఆ ప్రతిభకు ఆధారంగా అంతర్జాతీయ, జాతీయ అవార్డులు లేదా ఆ రంగానికి అతడు చేసిన సేవ, ఇతర గుర్తింపు పొందిన విజయాలు ఉండాలి. దీనికి ఉండే 8 ప్రమాణాల్లో కనీసం మూడింటైనా చేసి ఉండాలి. ఈ వీసాను ముందుగా మూడేళ్లకు జారీ చేసతారు. ఆ తర్వాత ఏడాది చొప్పున పొడిగిస్తారు. పని చేసందుకు లేదా స్వయం ఉపాధి పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. గతేడాది చూసుకుంటే అమెరికా 19,457 ఓ1 వీసాలను జారీ చేసింది.
ఇదిలాఉండగా హెచ్1 బీ ఫీజు పెంపు వల్ల భారతీయ కంపెనీలు గతంలో లాగా హెచ్1బీ వీసాలు పొందాలంటే అదనంగా ప్రతి కంపెనీ 150-550 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాళ్ల ఉత్పత్తులు, సేవల ఖరీదును కూడా పెంచేస్తుంది.