Driverless Vehicle: రోడ్డుపైకి డ్రైవర్‌లేని వాహనాలు.. వీడియో వైరల్

రాబోయే రోజుల్లో డ్రైవర్‌ అవసరం లేని వాహనాలు కూడా రానున్నాయి. తాజాగా అబుదాబిలోని ఓ డెలివరీ వాహనంలో ఈ టెక్నాజీనీ వినియోగించారు. మస్‌దాస్‌ అనే నగరంలో తొలిసారిగా డ్రైవర్‌ రహిత అటనామస్‌ వాహనాలు నడిపేందుకు అవకాశం ఇచ్చారు.

New Update
Abu Dhabi Issues First License for Self-Driving Delivery Vehicle

Abu Dhabi Issues First License for Self-Driving Delivery Vehicle

టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఆటోమొబైల్‌ రంగంలో చూసుకుంటే ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో డ్రైవర్‌ అవసరం లేని వాహనాలు కూడా రానున్నాయి. తాజాగా అబుదాబిలోని ఓ డెలివరీ వాహనంలో ఈ టెక్నాజీనీ వినియోగించారు. మస్‌దాస్‌ అనే నగరంలో తొలిసారిగా డ్రైవర్‌ రహిత అటనామస్‌ వాహనాలు నడిపేందుకు అవకాశం ఇచ్చారు. దీన్ని పబ్లిక్‌-ప్రైవేట్ రంగాలు కలిసి అభివృద్ధి చేశాయి. ఇందులో స్థానిక టెక్నాలజీ, లాజిస్టిక్స్‌ సంస్థలు భాగస్వాములయ్యాయి. 

Also Read: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్ నుంచి అమెరికా అధ్యక్షుడికి హామీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అబుదాబి మొబిలిటీగా పేరుపొందిన 'ది ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌' (ITC) దీన్ని మొదటిసారిగా పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద ప్రారంభించింది. కే2 సంస్థకు అనుబంధంగా ఉన్న ఆటోగో అనే సంస్థ ఈ వాహనాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో డ్రైవర్లు ఉండరు. కేవలం అత్యాధునిక  స్మార్ట్ మొబిలిటీ సిస్టమ్ ఆధారంగానే ఇది పనిచేస్తుంది. అక్కడ సెల్ఫ్‌డ్రైవింగ్ వాహనాలకు తొలి లైసెన్స్‌ ప్లేట్‌ను కూడా జారీ చేశారు. 

Also Read: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడిపై ఇస్లాం దేశాల సీరియస్.. రక్త దాహాన్ని అడ్డుకోవాలని తీర్మానం

డ్రైవర్‌ లేని ఆ సరకు రవాణా వాహనం రోడ్డుపై వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. సాధారణ ట్రాఫిక్‌తో సహా ఆ వాహనం వెళ్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. కేవలం నగరంలో మాత్రమే అది ప్రయాణం చేసేలా దాన్ని రూపొందించారు. అంతేకాదు ఈ వాహనాలు ట్రాఫిక్ చట్టాలు, రూల్స్‌ను కూడా ఫాలో అవుతాయి. ఈ ప్రాజెక్టులో కే2 టెక్నాలజీస్, EMX, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీస్‌, స్మార్ట్ అండ్ అటానమస్ సిస్టమ్‌ కౌన్సిల్‌ భాగస్వాములుగా ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే అబుదాబి మొత్తం ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆటోగో సంస్థ తమ ప్రాజెక్టును విస్తరించేందుకు మరిన్నీ డెలివరీ వాహనాలు రెడీ చేస్తోంది.  

Also Read: గుండెపగిలే ఘోరం.. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి దంపతులు సజీవ దహనం..

Advertisment
తాజా కథనాలు