HYD METRO: హైదరాబాద్ మెట్రోకు అరుదైన రికార్డు.. ఆ విషయంలో ప్రపంచంలోనే టాప్!

హైదరాబాద్‌ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే జర్నల్‌‌‌‌‌‌‌‌లో మెట్రోను గురించిన విశేషాలను ప్రచురించింది. దీంతో మెట్రోప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది.

New Update

HYD METRO: హైదరాబాద్‌ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే జర్నల్‌‌‌‌‌‌‌‌లో మెట్రోను గురించిన విశేషాలను ప్రచురించింది. దీంతో  హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీ మెట్రో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను కేస్ స్టడీగా తీసుకుని తన జర్నల్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూలో ‘హైదరాబాద్ మెట్రో – ఆలోచన నుంచి అమలువరకు: పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్ షిప్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్’ అనే హెడ్డింగ్ తో పరిశోధన పత్రాన్ని ప్రచురించింది.  

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

 హైదరాబాద్‌ మెట్రో ప్రారంభమైన నాటినుంచి ఎదుర్కొన్న సవాళ్లు , ఆటంకాలు ఇలా  ప్రతి అంశాన్ని ఈ పరిశోధనలో వెల్లడించారు. భూసేకరణ సమస్యలు, మేటాస్‌ కంపెనీ ఫేయిల్‌, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యలు, ప్రతిపాదిన సంస్థల నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురైన సమస్యలు ఇలా అన్ని విషయాలను జర్నల్‌లో చర్చించారు. అన్ని అవంతరాలను దాటుకుని మెట్రో వ్యూహాత్మక నాయకత్వం, స్ట్రాటజిక్ ప్లానింగ్, బోల్డ్ డెసిషన్స్‌‌‌‌‌‌‌‌తో 2017 నాటికి ఫస్ట్ ఫేజ్ ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా పూర్తిచేసినట్లు ఈ పత్రంలో వివరించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
 
ఇక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రాజెక్ట్‌‌‌‌‌పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్ షిప్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేర్కొంటూనే  ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఆదర్శంగా నిలిచిందని హార్వర్డ్ బిజినెస్‌ రిపోర్ట్ పేర్కొంది. మెట్రోఎండీగా ఉన్న ఎన్వీఎస్ఎస్ రెడ్డి  తన స్ట్రాటజిక్ విజన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా  తీర్చి దిద్దారని వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

 హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిందని,  కాలుష్యం కూడా తగ్గిందని పేర్కొన్నది. అంతేకాక ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సమర్థవంతమైన రవాణా  సౌకర్యం లభించినట్లు వివరించింది. దీనితో పాటు సంబంధిత స్టేషన్లలో కమర్షియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ జరగడం వల్ల ఆర్థిక వృద్ధి కూడా సాధ్యమైందని వివరించింది. కాగా  గతంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ), స్టాన్‌‌‌‌‌‌‌‌ ఫోర్డ్ యూనివర్సిటీలు కూడా హైదరాబాద్‌  సక్సెస్ స్టోరీని తమ రివ్యూ పరిశోధన పత్రాలుగా ప్రచురించడం విశేషం.  

ఇది కూడా చూడండి:BIG BREAKING: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO

Advertisment
Advertisment
తాజా కథనాలు