/rtv/media/media_files/2025/05/25/SAhgQRzSVK0hkUyswj16.jpg)
Manohar Dhakad
రాజకీయ నేతలు అయితే ఏమైనా చేసేయొచ్చు అనుకుంటారు. ఇప్పటి వరకు కొంమంది నేతలు హద్దులు దాటి వెళ్ళడం చూశాం. కానీ ఇప్పుడు మధ్య ప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత ఎవ్వరూ చేయలేని పని చేసి ఛీ అనిపించుకుంటున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తూ వీడియోలకు దొరికిపోయారు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో. అసలేం జరిగిందంటే..
రోడ్డు మీదే ఆ పని..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి ఢిల్లీ, ముంబై హైపై రోడ్డు మీదే ఒక మహిళతో ఆ పని చేస్తూ సీసీ టీవీ వీడియోలకు చిక్కారు. ఇతను బీజేపీ నేత కావడం మరో విశేషం. ఇతను చేస్తున్న ఆ వెధవ పని వీడియో కాస్తా సోషల్ మీడియాకు చిక్కింది. మామూలుగానే ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతాయి. అదీ ఒక నేత చేస్తున్నారు అంటూ మరింత వైరల్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వివాదాస్పద వీడియోలో ధాకడ్ ఒక తెల్ల బాలెనో కారు (MP14CC4782) వద్ద మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. కారు నంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా.. ఆ వాహనం మనోహర్ లాల్ ధాకడ్ పేరుతోనే నమోదు అయిందని గుర్తించారు. వీడియో వైరల్ అయిన తరువాత ధాకడ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై మందసౌర్ జిల్లా భాన్‌పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆయనపై 296, 285, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ధాకడ్ తో పాటూ ఉన్న మహిళను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు మనోహర్ ధాకడ్ వీడియోపై బీజేపీ కూడా స్పందించింది. అతనికి తమ పార్టీకి ఏమీ సంబంధం లేదని మందసౌర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ చెప్పారు. అతనికి ఎటువంటి పదవి ఇవ్వలేదని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సభ్యత్వం తీసుకున్నవాడై ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. కానీ మనోహర్ లాల్ ధాకడ్ భార్య మాత్రం బీజేపీ మద్దతుతో జిల్లా పంచాయతీ 8వ వార్డుకు ఎన్నికైన సభ్యురాలు అని సమాచారం. ధాకడ్ కోసం గాలింపు చర్యను ముమ్మరం చేశారు పోలీసులు.
today-latest-news-in-telugu | Madhya Pradesh | bjp-leader | sex | road
Also Read: Delhi: ఢిల్లీని ముంచిన వర్షాలు..100కు పైగా విమనాలు బంద్