అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్ అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా.. మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. By B Aravind 01 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే దాదాపు 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు మధ్య గట్టి పోటి నెలకొంది. ఈ ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేశారు. మరికొంతమంది మెయిల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Also Read: దూసుకుపోతోన్న చాట్‌జీపీటీ.. గూగుల్‌కు పోటీగా సరికొత్త ఫీచర్.. కమలా హారిస్ ముందంజలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో 40 నిమిషాల పాటు క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. ఇక నవంబర్ 5న మిగతా ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన పలు సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ కొంచెం ముందంజలో ఉన్నట్లు తెలస్తోంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్, హారిస్‌ల మధ్య పోటాపోటీ ఉన్నట్లు తాజాగా సర్వేలు చెబుతున్నాయి. జార్జియాలో హరిస్‌కు 47 శాతం మద్దతు రాగా ట్రంప్‌నకు 48 శాతం వచ్చింది. ఇక నార్త్ కరోలినాలో ట్రంప్‌నకు 47 శాతం రాగా.. హారిస్‌కు 48 శాతం మద్దతు వచ్చింది. 2008లో డెమోక్రటిక్ నుంచి పోటీ చేసిన బరాక్ ఒబామా నార్త్ కరోలినాలో గెలిచారు. ఆతర్వాత ఎన్నికల నుంచి మాత్రం ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం డెమోక్రట్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు సర్వేలు చెబుతున్నాయి. Also Read: షేక్ హసీనాకి భారీ షాక్.. పార్టీ కార్యాలయంపై దాడి ఇక జార్జియాలో గత ఎన్నికల్లో రిపబ్లిక్, డెమోక్రటిక్ అభ్యర్థు మధ్య తీవ్ర పోటీ జరిగింది. కేవలం ఒక్క శాతం మెజార్టీతో 2020 ఎన్నికల్లో బైడెన్ అక్కడ గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై కేవలం అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా కొత్త అధ్యక్షునితో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారీ తీస్తాయే అనేది చర్చనీయమవుతోంది. #telugu-news #donald-trump #usa-elections #kamala-harries #voting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి